//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దీక్ష విరమించి.. విజయశంఖం పూరించిన చంద్రబాబు

Category : state politics

సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షను విరమించి విజయ శంఖం పూరించారు. ఇద్దరు చిన్నారులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ‘రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందే’ అనే నినాదంతో ముఖ్యమంత్రి ‘ధర్మ పోరాట దీక్ష’కు దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం తన పుట్టిన రోజున... ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయన నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం వేదికగా... భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. ఇది ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న దీక్ష కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చంద్రబాబుకు మద్దతుగా ఆయా జిల్లాల్లో మంత్రులు దీక్షలు చేశారు. సీఎం చేపట్టిన దీక్షకు అనూహ్య మద్దతు లభించింది. అంతే కాకుండా ధర్మ పోరాట దీక్షలో సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, రాఘవేంద్రరావు,