ఎప్పుడు మంచుతో గడ్డకట్టి ఉండే అంటార్కిటికా ఖండంలో పచ్చదనం క్రమక్రమంగా పెరుగుతోందని, వాతావరణంలో వస్తున్న మార్పులే దీనికి కారణమని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. జీవ సంబంధమైన మార్పులూ జరుగుతున్నట్లు గుర్తించారు. నాచుతో కూడిన పచ్చని దిబ్బల సంఖ్య పెరుగుతోందని, గత యాభై ఏళ్లలో కన్నా ప్రస్తుతం ఈ పరిణామం వేగంగా జరుగుతోందని ఎక్సేటర్ విశ్వవిద్యాలయానికి చెందిన మట్ అమెస్బరీ వెల్లడించారు.