//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ డిజిటల్ కార్యక్రమం పట్ల సిస్కో ఆసక్తి

Category : state business

తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వామ్యానికి ప్రముఖ అమెరికా సాఫ్ట్ వేర్ సంస్థ సిస్కో ఆసక్తి ప్రదర్శించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి మంత్రి కె టి రామారావు ఆ సంస్థ చైర్మన్ జాన్ చాంబర్స్ తో కలసి ఈ మేరకు ఒక ప్రతిపాదనను ఆయన ముందుంచారు. 

తెలంగాణలో డిజిటల్ మౌలిక వసతుల కల్పనపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. సిలికాన్ వ్యాలీలోని సిస్కో ప్రధాన కార్యాలయంలో ఆయన మంత్రి కేటీఆర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్‌ను ప్రత్యేకంగా  కేటీఆర్ ప్రస్తావించారు.

తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వామ్యంకోసం ఆసక్తిగా ఉన్నామని చాంబర్స్ చెప్పారు. తెలంగాణలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు తరువాత ఎలాంటి మార్పులు వస్తాయో తెలిపే టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ నెట్‌వర్క్ నిర్మించేందుకు సహకరిస్తామని ఆయన మంత్రికి తెలిపారు. 

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని సమావేశంలో ఉన్న సిస్కో ఇండియా టీంకు సూచించారు. టీ హబ్‌లోని స్టార్టప్స్, హైదరాబాద్ ఎంటర్‌ప్రైన్యూర్స్‌కు మార్గనిర్దేశం చేసేందుకు సిస్కో టెలిప్రెసెన్స్ ద్వారా మాట్లాడుతానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సిస్కో సొల్యూషన్స్ ద్వారా పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని కోరారు. 

డిజిటల్ తెలంగాణ లక్ష్యసాధనకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని, డిజిటలైజేషన్ గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి, సమాజంలో పెనుమార్పులకు దారితీస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు పౌరసేవల్లో డిజిటలైజేషన్ ద్వారా గణనీయ మార్పులు తీసుకురావచ్చునని పేర్కొన్నారు. వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీ ద్వారా ఈ-హెల్త్, ఈ-ఎడ్యుకేషన్ రంగాల్లో అనేక ప్రయోజనాలుంటాయని తెలిపారు.