//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆధార్ డాటాను సేకరిస్తున్న సిఐఏ !

Category : national

ప్రభుత్వం డిజిటల్ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి దానికి ఆధార్ ను తప్పని సరిచేస్తుండగా, ఆ డేటాలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రత లేకుండా పోతున్నట్లు వ్యక్తం అవుతున్న ఆందోళనకు బలం చేకూరుతుంది. ప్రపంచంలోని ప్రముఖ నిఘా సంస్థలు ఈ సమాచారాన్ని తస్కరించటం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడి అవుతున్నది. 

తాజాగా, అమెరికాకు చెందిన సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్ టూల్స్ ద్వారా ఆధార్ డేటాను సేక‌రిస్తున్న‌ట్లు వికీలీక్స్ సంస్థ ఆరోపించింది. అయితే భార‌త ప్ర‌భుత్వం మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన‌ట్లు తెలుస్తున్న‌ది. క్రాస్ మ్యాచ్ టెక్నాల‌జీస్ సంస్థ‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ లేన్ అనే టూల్ ద్వారా సీఐఏ ఆధార్ డేటాను చోరీ చేస్తున్న‌ట్లు వికీలీక్స్ తెలిపింది.

 సైబ‌ర్ గూఢాచారుల‌కు ఆధార్ డేటాబేస్‌ బ‌ల‌వుతున్న‌ద‌ని వికీలీక్స్ త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. కోవ‌ర్ట్ స‌మాచారాన్ని సేక‌రించేందుకు ఎక్స్‌ప్రెస్ లేన్ టూల్‌ను వాడుతారు.  అమెరికాకు చెందిన క్రాస్ మ్యాచ్ టెక్నాల‌జీస్ సంస్థ బ‌యోమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్న‌ది. ఈ సంస్థ‌నే మొద‌ట్లో ఆధార్‌ను త‌యారుచేసే యూఐడీఏఐ సంస్థ‌కు బ‌యోమెట్రిక్ డివైస్‌ల‌ను అమ్మింది. 

కాగా, బ‌యోమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌ను అంద‌జేసిన సంస్థ‌ల గురించి యూఐడీఏఐ ఎప్పుడూ బ్యాక‌గ్రౌండ్ చెక్ చేయ‌లేదు అని కూడా వికీలీక్స్ మ‌రో క‌థ‌నంలో ఆరోపించింది. రియ‌ల్ టైమ్‌లోనే సీఐఏ ఏజెంట్లు ఆధార్ డేటాబేస్‌ను చోరీ చేయ‌గ‌ల‌ర‌ని వికీలీక్స్ పేర్కొన్న‌ది. పాకిస్థాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన‌ స‌మ‌యంలో అమెరికా మిలిట‌రీ క్రాస్ మ్యాచ్ టెక్నాల‌జీ సంస్థ సాఫ్ట్‌వేర్‌తోనే ఆల్‌ఖ‌యిదా నేత క‌ద‌లిక‌ల‌ను గుర్తించిన‌ట్లు తేలడం ఈ సందర్భంగా గమనార్హం.