క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇల్లంతా చక్కగా రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించుకుంది ఓ మహిళ. తీరా ఆమెకు వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ అయ్యింది. ఎందుకంటే.. ఆమెకు వచ్చిన కరెంటు బిల్లు . తమ ఇంటి కరెంట్ బిల్లును చూసిన ఓ మహిళ కళ్లు తేలేసింది. ఆమెకు గుండె ఆగిపోయినంత పనైంది.
లబోదిబోమంటూ భర్త, కొడుకుకు కరెంట్ బిల్లును చూపించింది. ఇంతకీ కరెంట్ బిల్లు ఎంత వచ్చిందబ్బా అనుకుంటున్నారా?.. తెలిస్తే మీరు కూడా షాక్‌కు గురవుతారు. అక్షరాలా 1 కోటీ 81 లక్షల కోట్ల రూపాయల(284 బిలియన్ డాలర్లు) కరెంట్ బిల్లు అది.
అమెరికాలోని పెన్సిల్వేనియాకి చెందిన హోరోమాన్సికికి వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్‌కు గురైంది. 284 బిలియన్ డాలర్లు కరెంటు బిల్లు చెల్లించాల్సిందిగా ఆమెకు నోటీసులు వచ్చాయి. మొదట విడతలో భాగంగా రూ.28,176 డాలర్లు చెల్లించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లోపు మొత్తం బిల్లు కట్టాల్సిందిగా నోటీసుల్లో ఉంది.
'క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టి విద్యుత్ దీపాలంకరణ చేసుకున్నాం.అంతమాత్రాన ఇంత కరెంటు బిల్లు వస్తుందా' అని వాళ్లు అధికారులను ఆశ్రయించారు. తీరా అసలు విషయం తెలిసిన తర్వాత హోరోమాన్సికి కుటుంబం వూపిరి పీల్చుకుంది. అధికారులు చేసిన తప్పిదం కారణంగా అంత కరెంటు బిల్లు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. వాళ్లకు గత నెలతో పోల్చుకుంటే కొద్దిగా మాత్రమే బిల్లు ఎక్కువ వచ్చింది.
కానీ అధికారులు పొరపాటు కారణంగా ఇది జరిగింది. హోరోమాన్సికి ఇంటికి కేవలం 284.46డాలర్లు మాత్రమే వచ్చింది. కానీ వారి పొరపాటు వల్ల 284 బిలియన్ డాలర్లుగా బిల్లులో వచ్చింది.అసలు విషయం తెలుసుకున్న నిర్వాహకులు జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరారు.