ఐపీయల్ లో మరో సారి గేల్ తన సత్తా ఏంటో చూపించాడు. టి20ల్లో తానెంతటి విశిష్ట ఆటగాడో చాటిచెప్పాడు, తనను తీసుకోకపోవడం ఎంత తప్పో ఇతర జట్లకు చెబుతూ, తన బ్యాట్ పదును తగ్గలేదని చెప్పాడు. అతడు బౌలర్స్ పై విరుచుకు పడ్డాడు.
ఐపీయల్ లో నే అతి భయంకరంగా బౌలింగ్ చేసే సన్ రైజర్స్ టీం పై గేల్ చెలరేగిపోయాడు. ఈ ఐపీయల్ సీజన్ లో తోలి సెంచరీ నమోదు చేసాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కింగ్‌లా నిలిచి వరుస విజయాల ఊపులో ఉన్న సన్‌రైజర్స్‌ను ఓటమి ముందు నిలిపాడు .
రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గేల్ (63 బంతుల్లో 104 నాటౌట్; 1 ఫోర్, 11 సిక్స్‌లు) దూకుడుతో కింగ్స్ ఎలెవెన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది. భువనేశ్వర్ (1/25) మెరుగ్గానే బౌలింగ్ చేసినా, రషీద్ ఖాన్ (1/55) భారీగా పరుగులిచ్చాడు.
ఛేదనలో శిఖర్ ధావన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా, కెప్టెన్ విలియమ్సన్ (41 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్ పాండే (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా బ్యాట్స్‌మెన్ చతికిలపడటంతో హైదరాబాద్ నాలుగు వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. 15 పరుగుల తేడాతో సీజన్లో తొలి ఓటమిని మూటగట్టుకుంది. ఆండ్రూ టై (2/23), శరణ్ (0/22), ముజీబ్ (0/27) పొదుపుగా బంతులేశారు. గేల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది