//single page style gallary page

Chiru Ram Charan Koratala Siva Combination

Category : movies

Click here to read this article in Telugu

చిరు,రామ్ చరణ్ కాంబో మరోసారి..?

మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నెంబర్ 150"తో తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు గడిచిపోయినా ఇంకా చిరు మరో సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం నటిస్తున్న "సైరా నరసింహారెడ్డి" అక్టోబర్ 2న విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది. అందుకు అనుగుణంగా బ్యాలెన్స్ వర్క్ మొత్తం ఫినిష్ చేస్తుంది. చిరు ఇక నుంచి స్పీడు పెంచాలని భావిస్తున్నారు. అయితే త్వరలోనే మరో సినిమాను ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ స్క్రిప్టును చిరు విన్నారు. ఈ చిత్రానికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అని వినికిడి. సైరా షూటింగ్ పూర్తయిన వెంటనే చిరు ఈ సినిమా షూటింగ్ లో పాలుకొంటారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అంతకంటే ముందు అంటే చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుందని తెలిసింది. ఇకపొతే రెగ్యూలర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ కానుంది అని టాక్.

ఇందులో చిరంజీవి హాకీ కోచ్‌గా కనిపించబోతున్నాడట. ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో కథను మలుపు తిప్పడంతో పాటు సినిమాలో తరచూ కనిపిస్తూ ట్రావెల్ అయ్యే పాత్ర ఒకటి ఉందట. దాని కోసం ఈ బడా డైరెక్టర్ చెర్రీని అడిగారని సమాచారం. దీనికి చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు. మరి ఇక ఈ విషయం ఎంతవరికి నిజమో వేచి చూడాలి.

The megastar Chiranjeevi boasted his comeback with " Prisoner Number 150 ". Two years after the film's release, another short film has yet to be released. The Chitra unit is scheduled to release on October 2, with the currently starring " Saira Narasimhareddy ". Accordingly, the balance work will finish the work. Speed is expected to increase from now. However, another movie is going to be launched soon. One of the interesting news related to it has come out recently .

Tollywood film director Koratala Siva has reportedly given the green signal to make a film. But have already heard this script . The film will also be produced by Charan. Hearing that the script work for the movie is underway. Shortly after the shooting of Saira, Chiru will be involved in the shooting. However, earlier this year, it was reported that the shooting of the film will officially begin on the occasion of a birthday. Talk that the regular shooting is going to start from the first week of September .

Chiranjeevi is going to be a hockey coach . Now the news is hulking in Filmnagar circles. The latest news is that Mega Power star Ram Charan will also be seen in the movie. It is a character who is often seen in the movie and is a traveller. The information that this Bada director asked Cherry for it. It is said in Filmnagar that Charan also gave the green signal. And we have to wait and see how true this is.