//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్‌కు మెగాస్టార్ చిరంజీవి రాజీనామా..?

Category : politics

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రంలో టీఆర్ఎస్‌తో సై.. అంటే సై అంటుంది కాంగ్రెస్‌. అటు, టీఆర్ఎస్ ఇప్ప‌టికే మెజార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించినా.. తొంద‌ర‌ప‌డ‌కుండా మ‌హాకూట‌మిని బ‌లోపేతం చేయ‌డంపైనే ఫోక‌స్ పెట్టింది. ఎన్నిక‌ల న‌గారా కూడా మోగేసింది. మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు అంశం చివ‌రికి వ‌చ్చేస్తుంది.

మ‌రో ప‌క్క‌, ఎన్నిక‌ల వార్‌లో భాగంగా టీఆర్ఎస్‌ను అవినీతి కోణంలో టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా, స్టార్ క్యాంపెయిన‌ర్ల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుఉ కాంగ్రెస్ కండువాలు స్కెచ్ గీశాయ‌ట‌. ఈ నేప‌థ్యంలో ఇటు విజ‌య‌శాంతి అటు చిరంజీవిల చేత క్యాంపెయినింగ్ చేయించాల‌ని ఎప్ప‌ట్నుంచో పీసీసీ నాయ‌క‌త్వం భావిస్తుంద‌ట‌. ఈ కోణంలో ఒక స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది అనుకున్న‌వేళ మరో షాక్ త‌గ‌ల‌బోతుందా..? అన్న గుస‌గుస‌లు కాంగ్రెస్ కేడ‌ర్‌లో వినిపిస్తున్నాయ‌ట‌.

నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో ఉన్నాను అంటే ఉన్నాను అన్న త‌ర‌హాలో ఉంటూ వ‌చ్చారు విజ‌య‌శాంతి. త‌న స్థాయికి త‌గ్గ గుర్తింపు, ప‌ద‌వి ఇవ్వ‌డం లేద‌ని అలిగిన విజ‌య‌శాంతి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. చివ‌ర‌కు రాహుల్ గాంధీ హైద‌రాబాద్‌కు వ‌చ్చిన వేళ కూడా అజ్ఞాతం వీడ‌లేదు. చివ‌ర‌కు పార్టీ హైక‌మాండ్ ఈ ఎన్నిక‌ల్లో విజ‌య‌శాంతిని స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ప్ర‌క‌టించ‌డంతో ఆమె అల‌క‌వీడారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఇక మెగాస్టార్ చిరంజీవిని కూడా సీన్‌లోకి తీసుకొచ్చి ఇద్ద‌రి చేత ఒక రేంజ్‌లో క్యాంపెయినింగ్ చేయించాల‌ని భావిస్తున్న పీసీసీ పెద్ద‌ల‌కు తాజా ప‌రిణామాలు షాక్ ఇస్తున్నాయ‌ట‌. చిరంజీవి ప్ర‌చారానికి రావ‌డం సంగ‌తి త‌రువాత అస‌లు కాంగ్రెస్‌లోనే ఉంటారా..? అన్న ప్ర‌శ్న‌కు తెర తీశాయి తాజా ప‌రిణామాలు. మెగాస్టార్‌, లేడీ అమితాబ్‌ల‌తో ప్ర‌చారం చేయించాల‌న్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు నిరాశ త‌ప్ప‌దా..? అన్న చ‌ర్చ‌కు కార‌ణం తెలుసుకోవాలంటే హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లాలి.

గ‌త శుక్ర‌వారం నాడు మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన‌కు జై కొట్టిన విష‌యం తెలిసిందే. విజ‌య‌వాడ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌లో చేరారు. త‌న‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పెద్ద‌న్న‌య్య అయిన చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయంటూ మ‌నోహ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం రేపుతున్నాయ‌ట‌.

కొంత‌కాలంగా కాంగ్రెస్ కార్య‌క్ర‌మాల‌న్నిటికీ చిరంజీవి దూరంగా ఉంటున్నారు. అయినా కూడా ఆయ‌న మా పార్టీలోనే ఉన్నారు, అవ‌స‌ర‌మైన వేళ ఆయ‌న త‌న సేవ‌లు అందిస్తారు అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి చెప్పుకుంటూ వ‌స్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆశీస్సులు మ‌న‌కే ఉన్నాయ‌ని ఓపెన్‌గానే మ‌నోహ‌ర్ చెప్ప‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎన్నిక‌ల నాటికి చిరంజీవి కూడా త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాన్ స్థాపించిన జ‌న‌సేన‌కే జై కొడ‌తార‌న్న డిస్క‌ర్ష‌న్ కాంగ్రెస్‌లో సాగుతోంద‌ట‌. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఒక స్టార్ వ‌చ్చార‌నుకుంటే.. మ‌రో స్టార్ వెళ్లిపోతున్నారా..? అన్న గుస‌గుస‌లు తెలంగాణ కాంగ్రెస్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయ‌ట‌. అంతేకాకుండా, చిరంజీవి కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్‌గా మారాయి.