//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చిరంజీవి ఫెయిల్యూర్‌కి ఇవేనా కారణాలు

Category : editorial movies

మెగాస్టార్ చిరంజీవి వెండితెర రారాజుగా వెలిగిన రోజులు మారిపోయాయ్. రాజకీయాల్లో తాను మంత్రి అవడం తప్ప సక్సెస్ అయింది లేదు. తాజాగా 150వ సినిమా వచ్చినా అదెక్కడ ఆడుతుందో ఎవరికీ తెలీని సిచ్యుయేషన్..దాని తర్వాత వస్తోన్న మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా సోసోగా సాగుతోంది..దీనికి కారణం ఆయన స్మాల్ స్క్రీన్ పై కూడా నటించాలనుకోవడమే అంటున్నారు. చక్కగా పార్టిసిపెంట్స్ తో కలిసిపోవాల్సిన సమయంలో కృతకంగా రాసిచ్చిన డైలాగులు చదవడం..చిన్న చిన్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పినా వావ్ చక్కగా ఆడుతున్నారంటూ అభినందించడం చూస్తే పాపం అందులో చిరు తప్పేం లేదనుకోవచ్చు..కానీ,

పదునైన అంచులేనిది సుత్తి, రామాయణంతో సంబంధంలేని క్యారెక్టర్ విదురుడు వంటి ప్రశ్నలు కార్యక్రమంలో వేయడమే తప్పు.

            దానికి స్క్రిప్ట్ తయారు చేసినవాళ్లని అనాలి..అందుకే ఇంత చిన్న చిన్న ప్రశ్నలైనా గతంలో నాగార్జున చేసినప్పుడు ఆయన దానికి చిన్న స్మైల్‌తో ఇది చాలా ఈజీ క్వశ్చెన్ సులబంగా చెప్తారంటూ రక్తి కట్టించేవాళ్లు..కానీ చిరంజీవికి చెప్పేవాళ్లు లేకనో..లేక ఇక్కడ ఇంతే చేయాలి..అక్కడ ఆ ఎక్స్ ప్రెషనే ఇవ్వాలి అన్నతీరుగా జరుగుతున్న తెలుగు కౌన్ బనేగా కరోడ్ పతి వెక్కిరింతకు గురవుతోంది..అదే ప్రోగ్రామ్ అయినతర్వాత తిరిగి ఆడియెన్స్‌తో కలిసిపోతున్న తీరు చూస్తే..ఇప్పటిదాకా మనం చూసిన చిరు..ఈ చిరు ఒక్కరేనా అన్పించకమానదు..అంటే యాంకరింగ్ అంటే ఏదో బలవంతంగా చేయిస్తున్నారేమో అన్పిస్తోందని ఫ్యాన్స్ టాక్..మరి చిరు ఈ సూచన వింటారో లేదో చూద్దాం..పైగా ఈ మధ్యకాలంలోనే బ్రహ్మానందం ఎపిసోడ్ చూస్తే..చనిపోయిన జంద్యాల గురించి అవాకులు చెవాకులు తాను పేలడమే కాకుండా అందులోకి చిరంజీవిని కూడా లాగాడాయన..దీంతో మిగిలిన వ్యూయర్స్ లో అసలు ఆ ప్రోగ్రామ్ తాలుకూ ఫ్లేవర్ పోయి..బ్రహ్మీ పిచ్చిగెంతులు విసిగించాయ్..ఇకనైనా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ చిరంజీవి స్టేచర్ కి తగ్గట్లు స్క్రిప్ట్ తయారు చేస్తారేమో చూడాలి