//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజదేవరకొండ కోసం మెగా ఫ్యామిలీ...!

Category : movies

టాలీవుడ్ లో ఇప్పుడు విజయదేవరకొండ క్రేజ్ అమాంతం ఆకాశాన్ని తాకేలా ఉంది. అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా విజయదేవరకొండ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకోవడానికి చాలా తక్కువ దూరంలో ఉన్నాడు.

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే యోచనలో టీమ్ ఉంది. మరోవైపు, ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తమ ఫంక్షన్ కు మెగాస్టార్ వస్తున్నారనే విషయం తెలియగానే విజయ్ దేవరకొండ చాలా ఎగ్జైట్ అయ్యాడట. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో విడుదలకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటించగా... పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంది.