//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోషల్ మెసేజ్ తో చిరంజీవి - కొరటాల సినిమా

Category : movies

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆయన స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

ఈ చిత్రం పూర్తీ అయ్యాక చిరంజీవి , కొరటాల శివ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కాగా తాజాగా సినీ సమాచారం ప్రకారం కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందట.

డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అయ్యన తెరకెక్కించి ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు కొరటాల శివ. ఇందులో కూడా చిరంజీవి రైతు సమస్యల పై పోరాడే రైతు పాత్రలో కనిపిస్తాడట. మరి కొరటాల చిరంజీవితో ఏ రేంజ్ మెసేజ్ ఇస్తాడో చూడాలి.