//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ గురిపెడుతున్న మిస్సైల్స్ తో చైనా ఖంగారు !

Category : national

ఒకవంక సిక్కిం వద్ద భారత్ - చైనా సరిహద్దులో సైనికుల మోహరింపు జరుగుతూ ఉండగా  చైనా ల‌క్ష్యంగా భారత్ త‌న మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠం చేస్తున్న‌ద‌ని అమెరికా అణు నిపుణులు వెల్ల‌డించడంతో ఎర్రగడ్డలో ఖంగారు వ్యక్తం అవుతున్నది. ఇన్నాళ్ళు పాకిస్థాన్ మాత్ర‌మే భార‌త్ ల‌క్ష్యంగా ఉండేద‌ని, ఇప్పుడు చైనా మొత్తాన్ని క‌వ‌ర్ చేసేలా మిస్సైళ్ల‌ను త‌యారు చేసే ప‌నిలో భార‌త్ ఉంద‌ని వాళ్లు చెప్పారు. 

ద‌క్షిణ భార‌తదేశంలోని బేసెస్ నుంచి ప్ర‌యోగిస్తే చైనా మొత్తం లక్ష్యంగా చేసుకొనే మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను భార‌త్ అభివృద్ధి చేస్తున్న‌ద‌ని ఆఫ్ట‌ర్ మిడ్‌నైట్ అనే డిజిట‌ల్ జ‌ర్న‌ల్‌లోని ఓ ఆర్టిక‌ల్ చెబుతున్న‌ది. ఇండియ‌న్ న్యూక్లియ‌ర్ ఫోర్సెస్ 2017 పేరుతో ఈ ఆర్టిక‌ల్‌ను రాశారు హ‌న్స్ క్రిస్ట‌న్‌సేన్‌, రాబ‌ర్ట్ నోరిస్ అనే అణు నిపుణులు. ఇండియా 150 నుంచి 200 వ‌ర‌కు న్యూక్లియ‌ర్ వార్‌హెడ్స్‌ను త‌యారు చేయ‌గ‌లిగే ప్లుటోనియంను స‌మ‌కూర్చుకోగ‌లిగింద‌ని, అయితే ఇప్ప‌టివ‌ర‌కు 120-130 మాత్ర‌మే త‌యారు చేసింద‌ని వెల్ల‌డించారు. 

 అగ్ని 4 మిస్సైల్‌తో చైనాలోని ఈశాన్య ప్రాంతం మొత్తం క‌వ‌ర్ అవుతుంద‌ని, ఇప్పుడు త‌యార‌వుతున్న అగ్ని 5 మిస్సైల్ మొత్తం చైనాను క‌వ‌ర్ చేస్తుంద‌ని రాబ‌ర్ట్‌, క్రిస్ట‌న్‌సేన్ తేల్చి చెప్పడంతో బలప్రయోగంతో భారత్ ను లొంగదీసు కోవడం సాధ్యంకాదని స్పష్టమైన సంకేతం చైనాకు ఇచ్చిన్నట్లు అయింది. ప్ర‌స్తుతం అణు సామ‌ర్థ్యం ఉన్న ఏడు వ్య‌వ‌స్థ‌లు భార‌త్ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు వారు  తెలిపారు. 

రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నాలుగు ఉప‌రిత‌ల బాలిస్టిక్ మిస్సైల్స్‌, స‌ముద్రంపై నుంచి ప్ర‌యోగించ‌గ‌లిగే బాలిస్టిక్ మిస్సైల్ భార‌త్ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇంకా నాలుగు వ్య‌వ‌స్థ‌లను భార‌త్ అభివృద్ధి చేస్తున్న‌ద‌ని, ఇవన్ని లాంగ్ రేంజ్ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌లేన‌ని ఆ నిపుణులు స్ప‌ష్టంచేశారు.