చైనాకు చెందిన టోంగ్జౌ కన్స్ట్రక్షన్ జనరల్ కాంట్రాక్టింగ్ గ్రూప్ రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. గృహ నిర్మాణం, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో పెట్టుబడులోని అవకాశాలపై సీఆర్డీఏ ఆర్థిక అభివృద్ధి విభాగాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టోంగ్జౌ సంస్థ ఓవర్సీస్ సేల్స్ మేనేజర్ ఫాన్ బింగ్, వైస్ జనరల్ మేనేజర్ డింగ్ హాయ్ రోంగ్, చెన్నైకి చెందిన స్పార్టెక్ గ్రూప్ ఛైర్మన్ త్రిపురనేని కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రాజధాని పరిధిలో ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు, అవకాశాల గురించి సీఆర్డీఏ ఆర్థికాభివృద్ధి డైరెక్టర్ నాగిరెడ్డి వారికి వివరించారు. వాటిలో ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులతోపాటు, ఉద్యోగులు సొంతంగా చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నారు.లండన్లోని నార్మన్ పోస్టర్ కార్యాలయంలో ఏపీ మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ ప్రతినిధులతో భేటీ అయ్యి అమరావతి డిజైన్లపై చర్చించారు.