Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తొలి క్యాష్‌లెస్ ఎయిర్‌పోర్టుపై చైనా చూపు

Category : world business

ప్రపంచంలోనే తొలి నగదు రహిత విమానాశ్రయంగా అవతరించేందుకు చైనాలోని హాంగ్జూ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. సేవలన్నిటినీ డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానం చేయడంతో పాటు... వేగవంతమైన సెక్యూరిటీ చెకింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ఈ మేరకు శనివారం చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఝీజాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్జూ విమానాశ్రయం... క్యాష్‌లెస్ పేమెంట్స్, సదుపాయాలు, విమానాలు, కార్ల అద్దెలు సహా పలు సేవల కోసం అలీపాయ్ వంటి ఇంటర్నెట్ దిగ్గజాలతో కలిసి పనిచేయనుంది. దీంతోపాటు టికెట్ బుకింగ్స్, రవాణా, స్మార్ట్ పార్కింగ్, షాపింగ్, క్యాటరింగ్, హోటల్ బుకింగ్ సహా డోర్ టు డోర్ సేవల కోసం... కంబైన్డ్ క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా వంటి సర్వీస్ ప్రొవైడర్ల సహాయం తీసుకోనుంది. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇమేజ్ రికగ్నిషన్ టెక్నాలజీతో సెక్యూరిటీ చెకింగ్ వేగవంతం చేయడంతో పాటు ప్రయాణికులకు వేచిఉండే సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

Related News