గతేడాది చైనా మార్కెట్ కుప్పకూలింది.దారుణ ఫలితాలను మూటగట్టుకుంది.భారీ స్థాయిలో తయారయి ప్రపంచానికి సవాల్ విసురుతాయనుకున్న మొబైల్స్ అత్యంత తక్కువ స్థాయిలోనే ప్రపంచ మార్కెట్లోకి వెళ్లాయి.ఈ విషయాలను చైనా న్యూస్ ఏజెన్సీ China Academy of Information and Communications Technology (CAICT) తెలిపింది.2017 చైనా మొబైల్ కంపెనీలకు కలిసిరాలేదని ఆధిపత్యపో పోరులో వెనక్కి తగ్గిందని ఈ న్యూస్ ఏజెన్సీ కుండబద్దలు కొట్టింది.
అన్ని చైనా కంపెనీల నుంచి గతేడాది షిప్మెంట్ అయిన మొత్తం మొబైల్స్ సంఖ్య 491 మిలియన్లు.చైనా కంపెనీల నుంచి గతేడాది బయటకు వచ్చి మార్కెట్లో హల్చల్ చేసిన కొత్త మొబైల్స్ సంఖ్య 1054. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12.3 శాతానికి పడిపోయింది. అంతకు ముందు ఏడాది ఇది 27.1 శాతంగా ఉంది.
గతేడాది మార్చి నుంచి ఈ తగ్గుదల కనిపిస్తోందని, డిసెంబర్ నెలలో అత్యంత ఘోరంగా 32.5 శాతం పడిపోయిందని ఇది చైనా కంపెనీలకు పెద్ద ప్రమాదకరమైన విషయమేనని న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది.
కాగా చైనా కంపెనీ హువాయి గతేడాది 153 మిలియన్ల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసింది. గ్లోబల్ మార్కెట్లో 10 శాతం వాటాను ఆక్రమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద స్మార్ట్ఫోన్ ప్లేయర్గా అవతరించింది.
ఇక షియోమి, ఒప్పో లాంటి కంపెనీలు ఆసియా మార్కెట్లో మంచి ఫలితాలను రాబట్టాయి. ఈ కంపెనీలు ఇక్కడ తమ ఆధిపత్యాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్నాయని ఇది ఆహ్వనించ దగ్గ పరిణామమని న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది.
అయితే భవిష్యత్ లో చైనా మొబైల్స్ వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఇది ఆందోళన కలిగించే విషయమని ఎనాలసిస్టులు చెబుతున్నారు.చైనా కంపెనీలు ఇప్పుడు ఇండియా ఇండోనేషియాలోని ఆఫ్ లైన్ మార్కెట్ మీద తమ దృష్టిని నిలిపాయని వారు చెబుతున్నారు.