చైనా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఇంజిన్‌కు భారీ రంధ్రం ఏర్పడింది. దాంతో కాలిపోతున్నట్లుగా వస్తున్న వాసనను పసిగట్టిన ప్రయాణికులు పైలట్‌కు సమాచారమందించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయంలో దించాడు. దాంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. ‘చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఎయిర్‌బస్ ఏ330 విమానంలో ఈ ఘటన చేటుచేసుకుంది.విమానం సిడ్నీ నుంచి చైనాలోని షాంఘైకి బయలుదేరిన గంట తర్వాత పెద్దగా శబ్ధం వచ్చింది. అనంతరం కాలిపోతున్న వాసన రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. దాంతో గాల్లో ఎగురుతున్న విమానం ఎక్కడ కూలిపోతుందోనన్న భయంతో అంతా వణికిపోయారు. విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్.. సిడ్నీలో సురక్షితంగా దించారు. విమానం ఇంజిన్‌కు భారీ రంధ్రం ఏర్పడిందని.. ఇంకాసేపు విమానం గాల్లోనే ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు.
ఎయిర్‌బస్ ఏ330 ఇంజిన్‌కు భారీ రంధ్రం
Related News
-
పాక్‌కు గుణపాఠం చెప్పడం కోసం , మరో కుమారున్ని సైతం సైన్యంలోకి పంపిస్తా.....!
-
ఉగ్ర దాడిని ఖండిస్తూ...అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
-
44 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న ఉగ్ర దాడి ..దాడి చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ
-
ఫేక్ న్యూస్ గ్రూప్ లే టార్గెట్ .. వాట్సాప్ సంచలనం
-
రాఫెల్ వివాదంపై కేంద్రానికి నేడు కాగ్ నివేదిక
-
సైబర్ నేరగాళ్ళకు చెక్ పెట్టండి ఇలా
-
విదేశాలకు వెళ్ళేవారు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఎందుకంటే
-
అమెరికాలో బంధీలైన తెలుగు విద్యార్థులు..న్యాయసహాయం అందిస్తున్న నాటా
-
దేశ వ్యాప్త సంచలనం ... రోడ్ మీదే సీఎం గా విధులు నిర్వర్తిస్తున్న మమత
-
సీపీ కోర్టుకు హాజరు కావాలన్న సుప్రీం ధర్మాసనం .. కొనసాగుతున్న వాదనలు
-
షాకింగ్ నిజాలు ... అమెరికా అండర్ కవర్ ఆపరేషన్.. స్టూడెంట్స్ అరెస్ట్