//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Category : national

పెళ్లికి ముందు అబ్బాయి తరుపు వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్లడం,పెళ్లి చూపులు జరగటం లాంఛనాలు,కట్న కానుకలు గురించి మాట్లాడుకోవడం ఈ పద్ధతి అందరికి తెలిసిందే.కట్నం కింద ఏ కారో బైకో,డబ్బో,బంగారమో,పొలమే ఇవ్వడం చూస్తుంటాం.కాని హర్యానాలో అక్కడ పెళ్లి కొడుక్కి కట్నం కింద ఊహించని రీతిలో అందరిని అబ్బురపరిచే విధంగా కట్నం ఇచ్చారు.అదే కొండముచ్చు.కట్నమేంటి కొండముచ్చేంటి అనుకుంటున్నారా నిజంగా కట్నం కింద కొండముచ్చును ఇచ్చారు.అంతేకాదు దానిని తీసుకెళ్లి చిక్కుల్లో పడ్డారు.హర్యానాలో జరిగిన ఈ విచిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

తోహానా ప్రాంతంలో కర్మవీర్ పూనియా కుమారుడు సంజయ్ పూనియా,దవనఖేడకు చెందిన హరిచంద్ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లి సంప్రదింపుల సమయంలో అమ్మాయి తరపువాళ్లు కట్నం కింద ఏం కావాలని అడగగా అబ్బాయి తల్లిదండ్రులు,బంధువులు తమ దగ్గర అన్నీ ఉన్నాయని,దేనికీ లోటు లేదని చెప్పారు.ఒకవేళ అమ్మాయి తరపున ఏమైనా ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటే కొండముచ్చును ఇవ్వమని పంచ్ వేశారు.పాపం వధువు కుటుంబ సభ్యులు నిజమేనని అనుకొని పెళ్లి రోజున కొండముచ్చును కట్నం కింద ఇచ్చారు.దీంతో అబ్బాయి కుటుంబ సభ్యులు షాకయ్యారట.

అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ కొండముచ్చును చక్కగా తీసుకెళ్లడం.అది తమకు ఉపయోగపడుతోందని వరుడు తండ్రి చెబుతున్నాడు.గత మూడేళ్లుగా కోతులు పంటల మీద దాడి చేసి నాశనం చేస్తున్నాయని,ఇప్పుడు ఈ కొండముచ్చు ఎంతగానో సహాయం చేస్తుందని ఆనందపడ్డాడు.కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.పంటలను కాపాడుతోందని కోతులు రాకుండా దీన్ని కాపలాగా పెట్టేశాడు.అప్పుడు దీన్ని చూసి భయపడి అవి పారిపోతాయి.అవి పంటల జోలికి రావు అని వరుడు తండ్రి తెగ సంబరపడిపోయాడు.విషయం తెలుసుకున్న వైల్డ్‌ లైఫ్ అధికారులు నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లారు.కొండముచ్చును నిర్బంధించడం నేరమని చెప్పి కొండముచ్చును జూకు తరలించారు.

Related News