//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏటీఎంలో చిన్న పిల్లల డబ్బు........!

Category : national

తన అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఏటీఎమ్‌కు వెళ్లి, డ్రా చేయగా పిల్లలు ఉపయోగించే నకిలీ నోటు వచ్చింది. కాన్పూర్‌లో జరిగిన ఈ సంఘటనతో దేశంలోని ఏటీఎమ్‌ల పట్ల అభద్రతాభావం నెలకొంది. నగరంలోని ఓ ప్రాంతంలో ఉన్న ఆక్సిస్ బ్యాంక్ ఏటీమ్‌లో ఈ నకిలీ నోటు దర్శనమిచ్చింది. ఈ సంఘటనపై ఆ వ్యక్తి స్పందిస్తూ ‘‘నేను రూ.10,000 డ్రా చేసుకోవడానికి ఏటీఎమ్‌కు వెళ్లాను.

అయితే ఏటీఎమ్ నుంచి వచ్చిన రూ.500 నోట్లలో ఒక నోటుపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంది. ఆ నోటును అక్కడే ఉన్న గార్డ్‌కు చూపించాను. గార్డ్ దీన్ని రిజిస్టర్ చేశాడు’’ అని చెప్పాడు. ఇదే విషయమై సౌత్ కాన్పూర్ ఎస్‌పీ మాట్లాడుతూ ప్రస్తుతం ఏటీమ్‌ను ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నిలిపివేసనట్లు పేర్కొన్నారు.