//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గోర‌ఖ్‌పూర్‌లో 105కు చేరిన శిశువుల మరణాలు

Category : national

గోర‌ఖ్‌పూర్‌లోని బాబా రాఘవ దాస్ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో పిల్లల మరణాలు మాత్రం ఆగడం లేదు.  గత 24 గంటల్లో మరో 9 మంది చిన్నారులు చనిపోవటంతో ఆ సంఖ్య 105కి చేరుకుంది. ఈ విషయాన్ని డాక్టర్‌ పీకే సింగ్‌ ధృవీకరించారు. నియోనాటల్ వార్డులో ఐదుగురు, ఏన్కెఫలైటిస్ వార్డులో ఇద్దరు, సాధారణ వార్డులో ఇద్దరు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. 

చనిపోయిన వారిలో చాలా మంది నవజాత శిశులు ఉన్నారని, అత్యవసర స్థితిలోనే వారిని తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చారని సింగ్ తెలిపారు. ఆగష్టు 10 నుంచి ఆగష్టు 11వ వరకు ఆ 48 గంటల్లో 30 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయారంటూ జిల్లా మెజిస్ట్రేట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉంది.

మరో వంక, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్య‌నాథ్  గోర‌ఖ్‌పూర్‌లోని అంధియారి భాగ్ కాల‌నీలో రోడ్డు ఊడ్చారు. స్వ‌చ్ఛ యూపీ, స్వ‌స్త్ యూపీ ప్ర‌చారాన్ని ఆయ‌న మొద‌లుపెట్టారు.  ఎన్‌సెఫిలైటిస్‌కు వ్య‌తిరేకంగా తానే ఉద్య‌మాన్ని చేప‌ట్టాన‌ని, వ్యాధిని ముందుగా అరిక‌ట్ట‌డ‌మే ముఖ్య‌మ‌ని, అది ప‌రిశుభ్ర‌త‌తోనే సాధ్య‌మువుతుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు ప‌రిశుభ్ర‌త‌పై దృష్టి పెట్టాల‌న్నారు. గ‌త 15 ఏళ్లుగా ప్ర‌భుత్వాలు యూపీని నాశ‌నం చేశాయ‌న్నారు.

ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ రోజు రానున్నారు  బీఆర్డీ ఆస్పత్రిని కూడా ఆయన సందర్శించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

Related News