//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సొంత అమ్మమ్మ అమ్మేసింది...కొనుక్కున్న వాళ్ళు నరకం చూపించారు !

Category : national

ఏమైపోతుంది సమాజం, ఎక్కడికి పోతున్నాం మనం, ఎంత నీచానికి దిగజారి పోతున్నాం.రోజు రోజుకు ఎన్నో దారుణాలు ఎన్నెనో అరాచకాలు.కామాంధుల వలలో ఆడవాళ్లు బలియైపోతున్నారు.లైంగిక దాడులకు గురవుతున్నారు.నిర్భయచట్టాలు ఉన్న నిబ్బరంగ తిరుగుతున్నారు.తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఉన్న ఆడవాళ్లకే రక్షణ లేని ఈ రోజుల్లో, ఎవరు లేని అభాగ్య ఆడవాళ్ళ పరిస్థితి చాల ఘోరంగ ఉంది.వివరాల్లోకి వెళ్తే,

మన దేశరాజధాని అయిన ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.అమ్మమ్మ తల్లిదండ్రులను కోల్పోయిన బాలికను 4,000 రూపాయలకు విక్రయిస్తే, రెండేళ్లపాటు బాలిక నరకం చూసిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.దాని వివరాల్లోకి వెళ్తే... జార్ఖండ్‌ లోని గొడ్డా జిల్లాకు చెందిన బాలిక (15) రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది.దీంతో బాలిక బాధ్యతలు అమ్మమ్మ తీసుకుంది.అనంతరం ఆమెను ఢిల్లీకి చెందిన సురేందర్‌ అనే వ్యక్తికి 4,000 రూపాయలకు విక్రయించింది.

సురేందర్‌ ఇంట్లో అడుగుపెట్టిన తొలిరోజే ఆమె అత్యాచారానికి గురైంది.ఆ తరువాత ఆమెను తన స్నేహితుడు మణి మిశ్రా వద్ద పనికి పెట్టాడు.మిశ్రా ఆమెపై తొలిరోజు నుంచే లైంగిక దాడికి పాల్పడ్డాడు.కాళ్లను కట్టేసి, సిగరెట్లతో కాల్చి రెండేళ్లపాటు నరకం చూపించాడు.వారి బారినుంచి తప్పించుకున్న బాలిక ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను చికిత్స నిమిత్తం బీటీ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.