//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జయరాం మర్డర్ మిస్టరీలో చిక్కుముడులు ఎన్నో ..

Category : politics state

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసు థ్రిల్లర్‌ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి అని తేల్చినా...లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. ఇక జయరాం భార్య ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు తెలంగాణా పోలీసులు ఈ కేసును విచారించాలని కోరటంతో ఏపీ పోలీసులు ఈ కేసును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే...ఇందులో పలు చిక్కుముడులున్నాయి. పోలీసులు చేధించాల్సిన మిస్టరీలు ఉన్నాయి.

ప్రధానం గా ఈ కేసులో జయరాం దగ్గర రూ. 4.5 కోట్లు లేవా..? బడా వ్యాపారులతో సంబంధాలున్నా.. రాకేశ్‌ దగ్గరే ఎందుకు అప్పు తీసుకున్నాడు..? రాకేశ్‌తో పరిచయం ఎలా జరిగింది ..? రాకేశ్‌ ఆర్థిక పరిస్థితి ఏంటి..? అప్పుకు, హత్యకు లింకేంటి..?

జయరాం పరిచయం లేని మహిళ రమ్మంటే ఎలా వెళ్లాడు..?ఇంతకీ ఆ యాంకర్ ఎవరు ? రూ. 6 లక్షలు అరేంజ్‌ చేసింది ఎవరు..? డబ్బు తీసుకున్నది ఎవరు..? గొంతు నులిమి చంపితే.. తలపై గాయం ఎలా అయింది..? శరీరం నల్లగా మారిందనే ఊహాగానాలు..ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ రాకుండానే విషప్రయోగం జరగలేదని పోలీసుల నిర్దారణ ఎలా సాధ్యం ? హత్య చేసింది రాకేశ్‌ ఒక్కడే అయితే.. ఇంకా విచారించాల్సింది ఎవరిని..? హత్య జరిగిన ఇంట్లో ఐదుగురు భోజనం చేసిన ఆనవాళ్లు..!

రాకేశ్‌, జయరాం కాకుండా మిగిలిన వారు ఎవరు..? శిఖాకు జయరాం మరణ వార్తను ఫోన్‌ చేసి చెప్పింది ఎవరు..?జయరాం ఇంట్లో ఆస్తి పత్రాల కోసం వెతికిన శిఖా .. ఆమెతో పాటు వెళ్లిన వ్యక్తి శ్రీకాంత్ ఎవరు..? ఆస్తి పత్రాలు మిస్సయ్యాయా..?శిఖాకు జయరాంకు ఆస్తి తగాదాలు ఉన్నాయా..? రాకేశ్‌కున్న సంబంధం ఏంటి..? అమెరికా పోలీసులు ఎంట్రీ ఇస్తే.. కేసు ఏ మలుపు తీసుకోనుంది..? ఇవన్నీ జయరాం మృతి విషయంలో వీడని చిక్కుముడులు . ఈ చిక్కు ముడులు వీడితే కానీ ఈ కేసులో ఎవరు ఎందుకు జయరాం ను హత్య చేశారో అర్ధమయ్యేది.