//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గిరిజనులపై వరాల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు.......!

Category : politics

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులపై వరాల జల్లు కురిపించారు. గురువారం విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో అయన మాట్లాడుతూ స్వచ్ఛమైన మనుషులు మీరు...అడవితల్లి వారసులు మీరు. మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది అని చెప్పుకొచ్చారు.

మీ అందరికీ కనీస సదుపాయాలు కల్పించడానికి రూ.2,564 కోట్లు ఖర్చు చేసి మీ రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు హామీ ఇచ్చారు. అలాగే గిరిజనులకు 50 ఏళ్లకే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి అదనంగా ఆదివాసీలకు రూ.లక్ష, గిరిజనులకు రూ.75వేలు, మైదాన ప్రాంత గిరిజనులకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని చెప్పారు.

ఈ ప్రభుత్వం గిరిజనులకు మరెన్నో అభివృద్ది ఫలాలు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు...."గిరిబాట పేరుతో అన్ని గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేస్తా...గిరినెట్‌ పేరుతో గిరిసేవా కేంద్రాలను ఏర్పాటు చేయిస్తా. అలాగే మారుమూల గ్రామాలకు సమాచార వ్యవస్థను విస్తరించడం కోసం 230 టవర్లను నెలకొల్పుతా...దీని కోసం రూ.329 కోట్లు ఖర్చు చేస్తున్నాం...గృహ నిర్మాణాలకు అదనపు సాయం అందిస్తాం... విద్య, వైద్య రంగాలకు రూ.కోట్లలో ఖర్చుచేసి మీ అందరి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు