మీకు చికెన్ అంటే ఇష్టమా? కేఎఫ్‌సీ అంటే అంత కంటే ఇష్టమా? చికెన్ ఫ్రై చేసిన వాసన వస్తే నోట్లో నీళ్ళు ఊరుతాయ ? అయితే మీ లాంటి చికెన్ ప్రియుల కోసం ఓ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టింది.
బాగా వేయించిన చికెన్ వాసన వచ్చే బాత్ సోప్ లని తయారు చేస్తోంది కేఎఫ్‌సీ. ఇప్పటికే జపాన్‌లో ఇలాంటి సబ్బులను కేఎఫ్సీల ద్వారా వీటిని మార్కెట్లోకి తెస్తోంది. ఈ సబ్బును ఆషామాషీగా ఏం తయారు చేయడం లేదట. 11 రకాల రహస్య ఔషధ మూలిలకలు, సుగంధ ద్ర్యవాలను ఈ సోప్ తయారీకి వాడుతున్నట్లు ప్రకటించింది కేఎఫ్‌సీ.
ముందుగా వీటిని మార్కెట్లో అందరికీ విక్రయించరట. నవంబర్ 15 వరకూ ఓ క్యాంపెయిన్ నిర్వహించి వంద మంది లక్కీ విన్నర్లు మాత్రమే వీటిని అందిస్తారట. సబ్బులంటే కొత్తేమో గానీ చికెన్ వాసన వచ్చే ఉత్పత్తులను మార్కెట్లోకి రిలీజ్ చేయడం కేఎఫ్‌సీకి మాత్రం కొత్త కాదు. గతంలో ఫ్రైడ్ చికెన్ వాసన వచ్చే సన్‌స్క్రీన్ లోషన్లు, లిప్ బామ్‌లు, కొవ్వొత్తులను కేఎఫ్‌సీ విక్రయించింది ఇక ఇప్పుడు సబ్బుల వంతు.