//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శతకం బాదిన పుజారా..భారత్ తోలి ఇన్నింగ్స్ ఆలౌట్...

Category : sports

సౌతాంప్టన్ లో భారత్ మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తోలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246 ఆలౌట్ అయినా సంగతీ తెలిసిందే. అనంతరం బాటింగ్ ఆరంభించిన భారత్ మొదటిలో నిలకడగా ఆడిన ఆ తరువాత వరసపెట్టి వికెట్లు కోల్పోయింది. కానీ పుజారా నిలకడగా ఆడి భారత్ స్కోర్ బోర్డు ను పరిగెత్తించాడు.

కాగా మొదటి ఇన్నింగ్ లో ఛటేశ్వర్ పుజారా 210 బంతుల్లో (11×4) 101 పరుగులు చేసి తన కెరీర్ లో 15 వ సెంచరీ పూర్తి చేశాడు. వరస వికెట్స్ పడుతున్నప్పటికీ ధాటిగా ఆడి 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. 273 వక్తిగత స్కోర్ వద్ద భారత్ ఆలౌట్ అయ్యుంది. కెప్టెన్ కోహ్లీ 46 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే భారత్ ఇంగ్లాండ్ ఫై 27 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది..అనంతరం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది.

Related News