ఛతేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్లో భారత్ కు దొరికిన ఆణిముత్యం. రాహుల్ ద్రావిడ్ తర్వాత టెస్టుల్లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు ద "వాల్" గా నిలుస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు సందర్భంగా అతను చేసిన ద్విశతకం వెలకట్టలేనిది. దాదాపు 180 ఓవర్లు పాటు, క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయడమంటే మాటలు కాదు. ఈ టెస్టులో భారత్ 360 పరుగులు వెనుకబడి ఉన్నప్పుడు క్రీజులోకొచ్చిన పుజారా ఎంతో క్రమశిక్షణ, సహనంతో బ్యాటింగ్ చేసాడు. పుజారా టెస్టు క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే పుజారా లాంటి ఆటగాడికి IPL వంటి టోర్నీలో అసలు విలువే దక్కలేదు. అతన్ని ఏ జట్టు తీసుకోలేదు. అనామక ఆటగాళ్లకు లక్షలు పోసి కొనుక్కుంటున్న ప్రాంచైజీలూ పుజారాను తీసుకోకపోవడం శోచనీయం. పుజారా లాంటి విలువైన ఆటగాడికి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. అతనికి సెంట్రల్ కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజు తప్ప మరో ఆదాయ వనరు లేదు. పుజారా లాంటి ఆటగాళ్ల కోసం BCCI నూతన కాంట్రాక్టు విధానం తెస్తే బాగుంటుంది. వాళ్ళను ప్రోత్సహించినట్లు ఉంటుంది.