//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో వివాదంలో చిక్కుకున్న చెన్నై సూపర్ కింగ్స్..!

Category : sports

రెండు సంవత్సరాల నిషేధం తరువాత ఈ సరి మల్లి ఐపీల్ లో ఎంట్రీ ఇస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇప్పుడు మళ్ళీ ఆ జట్టు మరో వివాదం లో చిక్కుకున్నది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రమోషన్ లో భాహం గా ఎల్లో ఆర్మీ పేరుతో కొనసాగే పాట రూపొందించారు.

ఇప్పుడు ఈ పాటె చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను వివాదం లోకి నెట్టింది. ఈ పాట మొదట్లో బట్టలు ఆరేసుకునే తీగ మీద నుంచి టెండూల్కర్ పేరుతో ఉన్న నంబర్ 10 జెర్సీ కిందపడి పోతున్నట్టు చూపించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది, ఎల్లో ఆర్మీ పాటలో ఆ జెర్సీని కింద పడేయడం ద్వారా సచిన్ ను అవమానించారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు.

పాట నుంచి దీన్ని తొలగించాలని సచిన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. నంబర్ 10 జెర్సీనీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వాడిన సంగతి తెలిసిందే. క్రికెట్ నుంచి సచిన్ రిటైర్ అయిన తర్వాత ఆయన గౌరవార్థం నంబర్ 10 జెర్సీకి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. దీంతో, భారత్ లో ఎవరూ నంబర్ 10 జెర్సీని ధరించారు .