//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కబాలి పేరు తో చెన్నై పోలీస్ ఆపరేషన్....!.

Category : national

చెన్నై పోలీసులు సిటీ రౌడీలకు 'సినిమా' చూపించారు. మామూలు సినిమా కాదు.. రజనీకాంత్ 'కబాలి' మూవీ! సిటీలో పేరుమోసిన రౌడీ షీటర్లందర్నీ ఒక్కచోట చేర్చి.. ఆ గుంపు మీద మెరుపుదాడి చేయడమనే గెరిల్లా మార్క్ స్ట్రాటజీని అప్రయత్నంగానే అమలు చేశారు చెన్నై సిటీ ఖాకీలు. కట్ చేస్తే.. సిటీలోని గొప్పగొప్ప పిస్తాలంతా ఇప్పడు కటకటాల వెనకే! ఈ అరుదైన ఆపరేషన్ చేపట్టిన ఖాకీల మీద ఇప్పుడు బోలెడన్ని ప్రశంసలు పడిపోతున్నాయి.

చెన్నై సిటీలోనే అతిపెద్ద రౌడీషీటర్ బిను! నిన్న మంగళవారం వీడి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని అట్టహాసంగా జరుపుకోవాలని ప్లాన్ చేశాడు. పూనమల్లై ప్రాంతంలోని ఒక తోటలో 'స్పాట్' పెట్టి.. సిటీలో సహచర రౌడీలందరికీ ఇన్విటేషన్లు పంపాడు. దాదాపు 80 మంది రౌడీషీటర్లు ఒకే వేదిక మీద.. చూడ ముచ్చటగా!

ఆ మజాలోనే.. మటన్ షాప్ నుంచి తెప్పించిన కైమా కత్తితో కేక్ కట్ చేసి.. పండగ చేసుకున్నాడు. 'రౌడీ ఫ్రెండ్స్'తో కలిసి ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నాడు.అక్కడే ఆటా,పాటా,అన్నీ ఐతే..

ఈ మొత్తం స్కెచ్ వెనుక మరో కుట్ర కూడా ఉంది. రాధాకృష్ణ అనే మరో రౌడీకి ఇక్కడే స్పాట్ పెట్టాలని.. అంటే 'లేపెయ్యాలన్నది' బిను పన్నాగం. కానీ..

అతడు ఒక్కడే ఈ సీన్లో మిస్సయ్యి 'బతికిపోయాడు'. కానీ ఇక్కడే కథలో కీలక మలుపు..!

ఒక రౌడీ షీటర్ మీద నిఘా పెట్టిన తాంబరం పోలీసులు.. వాడు రెండు పెద్ద కార్లలో బలగాల్నేసుకుని బయల్దేరడంతో అనుమానం వచ్చి ఈ మొత్తం వ్యవహారాన్ని పసిగట్టేశారు.

వాడ్ని వెంబడించి.. పెద్ద రౌడీ బిను బర్త్ డే సెలెబ్రేషన్ స్పాట్ కి రహస్యంగా చేరుకున్నారు. అందరూ ఒకేచోట దొరికేసరికి.. చెన్నై ఖాకీలు మరిన్ని టీమ్స్ ని పిలిపించుకుని మెరుపు దాడి చేశారు.

బినుతో పాటు చాలామంది తెలివిగా తప్పించుకోజూసినా పోలీసుల కళ్లుగప్పలేక మళ్ళీ దొరికిపోయారు. కొందరు తప్పించుకున్నా ఒక్క దెబ్బతో మొత్తం 67 మంది ఆకురౌడీలు వాళ్ళ మారణాయుధాలు, కార్లు, ఫోన్లు, బైకులు అన్నీ ఇప్పుడు పోలీసుల ఆధీనంలో.

ఇప్పుడు ఖాకీల కంట్రోల్లో వున్న పేరుమోసిన రౌడీ బిను మీద అనేక కిడ్నాప్ లు, హత్యలు, స్మగ్లింగ్ కేసులున్నాయి. ఇతడికి చెన్నైలోని ఒక పెద్ద పొలిటికల్ తలకాయతో సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం.. కబాలి మూవీ క్లయిమాక్స్ రీషూట్ చేసినట్లుంది చెన్నై పోలీసుల యాక్షన్ ప్లాన్!

హీరో విశాల్ అయితే.. వీళ్ళ చురుకుదనాన్ని ట్విట్టర్ ద్వారా గట్టిగా మెచ్చుకున్నారు.