Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెన్నై మ్యాచ్ ఫిక్సింగ్ యేనా..?

Category : sports

ఐపీల్ ఆరంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీల్ ని ఫిక్సింగ్ భూతం ఇప్పటి నుంచి కాదు ఐపియల్ ఆరవ సీజన్ నుంచి వెంటాడుతుంది.

దీనితో ఏ మ్యాచ్ జరిగినా ఫిక్స్ అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇదే అనుమానం వ్యక్తమైంది. ఆ మ్యాచ్ ముంబై గెలవడం నిజంగా చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఇది ఇలా ఉంటె ఈ ఏడాది టోర్నీ ఆరంభ మ్యాచ్ పై కూడా ఫిక్సింగ్ నీడలు కమ్ముకున్నాయి. తొలి మ్యాచ్ చప్పగా సాగితే ఆ ఎఫెక్ట్ టోర్నీ పై పడుతుంది అనే భావనలో మ్యాచ్ ని ఉత్కంట స్థితికి తీసుకుని వచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అసలు గెలిచే మ్యాచ్ కాదని చెన్నై ఎలా గెలిచింది అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఐపీల్ లో జరిగే ప్రతి మ్యాచ్ పైనా ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆ మ్యాచ్ లో బ్రావో 30 బంతుల్లో 68 పరుగులు చేసి టీంకి విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే.