//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గర్ల్స్.. మనం డేంజర్ లో ఉన్నాం.. నాకు జరిగినట్లు మీకు జరగకూడదు !

Category : editorial

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాల పట్ల మహిళలకు అప్రమత్తంగా ఉండాలి,.. ఈ విషయం ఇప్పటికే అనేక సార్లు రుజువు అయ్యింది.

కాగా.. తాజాగా జాబ్స్ పేరుతో వచ్చే కాల్స్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని తనకు ఇటీవల జాబ్ పేరిట వచ్చిన ఓ కాల్ గురించి చెన్నైకి చెందిన ఓ యువతి చెబుతున్న వివరాల్లోకి వెళ్తే...
నమ్య అనే చెన్నై బ్లాగర్ ఉద్యోగ వేటలో ఉంది.. తన నెంబర్ తెలుసున్న వారికి ఇవ్వడమే కాదు.. జాబ్స్ కోసం నెట్ లో సెర్చ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ యువతికి "ఎయిర్ ఫ్రాన్స్" నుంచి ఓ కాల్ వచ్చింది.. కాల్ చేసిన అతను.. మీ వివరాలను మా ఎగ్జిక్యూటివ్ చెప్పాడు..జాబ్ కు పెద్దగా ఫార్మాలిటీస్ లేవు.. వాట్సప్ వీడియో కాల్ లో ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పాడు.

అనంతరం వీడియో కాల్ మొదలైంది..  మొదట మీ ఎత్తు, బరువు చూపించండి.. మీ ఒంటిమీద పుట్టి మచ్చలు లతో పాటు మీ పొట్టను చూపించండి అంటూ ఇంటర్వ్యూ చేస్తున్నారు.. దీంతో ఆ యువతికి సందేహం వచ్చి.. సారీ నేనలా చేయలేను అని అంది.. ఇప్పుడు ధరించిన బట్టలతో పొట్ట చూపించడం కష్టమైతే టీ షర్ట్ ధరించండి అని చెప్పాడు.. దీంతో నమ్య కు ఇది ఉద్యోగం కోసం జరుగుత్న ఇంటర్వ్యూలా లేదు.. అనిపించింది.. వెంటనే కాల్ కట్ చేసింది.

తర్వాత తనకు వచ్చింది ఎయిర్ ఫ్రాన్స్ నుంచి కాదు... ఆ పేరుతో ఎవరు తనని ట్రాప్ చేయడానికి చేసిన కాల్.. అని అర్ధం చేసుకొన్నది. వెంటనే ఆ వాట్సప్ చాట్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... ఆగంతకుడి కోసం వేట మొదలు పెట్టింది.. అంతేకాదు.. తనలా ఉద్యోగం కోసం వెదుకుతున్న యువతకు తగు జాగ్రత్తలు తీసుకోమని.. ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయో వివరిస్తూ ఓ ఉత్తరం కూడా పోస్ట్ చేసింది..

గర్ల్స్.. మనం డేంజర్ లో ఉన్నాం.. నాకు జరిగినట్లు మీకు ఎవరికీ జరగకూడదు... ఫోన్ లో ఉద్యోగం పేరుతో వచ్చే కాల్స్ తో జాగ్రత్తగా ఉండండి అని రాసింది. మీ చేతిలోని స్మార్ట్ ఫోన్ చిక్కులనుంచి పడెయ్యడమే కాదు.. చిక్కులను తెస్తుంది కూడా జాగ్రత్త.. !!

Related News