//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎయిర్ పోర్ట్స్, మాల్స్, సినిమా హాల్స్ లో అధిక ధరలకు చెక్ !

Category : business

ఏ వస్తువుకైనా అన్ని చోట్ల గరిష్ట అమ్మకపు ధర ఒకే విధంగా ఉండేటట్లు ప్రభుత్వం చేస్తున్నది. దానితో 2018 ప్రారంభం నుండి ఎయిర్ పోర్ట్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ లలో అధిక ధరలకు వస్తువులను అమ్మడానికి వీలుండదు. 

ప్యాక్ చేసిన వస్తువుల ధరలకు సంబంధించిన నిబంధనలలో  ఈ మేరకు తీసుకు వచ్చిన మార్పులు వచ్చే జనవరి 1 నుండి అమలు కానున్నాయి. వ్యాపారులకు కొత్త నిబంధనలకు అనువుగా అవసరమైన మార్పులు చేసుకొనేందుకు కొంత వ్యవధి ఇవ్వడం కోసం జనవరి నుండి అమలులోకి తెస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కొత్త నిబంధనల ప్రకారం ప్యాక్ చేసిన వస్తువులకు ఇతరత్రా చట్టం అనుమతిస్తే తప్ప ఎవ్వరూ వివిధ చోట్ల వివిధ రకాల గరిష్ట అమ్మకపు ధరలను  వర్తింప చేయరాదు. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఎయిర్ పోర్ట్స్ వంటి చోట్ల ఎక్కువ ధరలకు వస్తువులు అమ్ముతున్నారని వినియోగ దారుల నుండి వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

అయితే ఈ నిబంధన కౌంటర్ లలో వస్తువులు కొనేవారికే వర్తిస్తుంది గాని తమకు వర్తింపదని రెస్టారెంట్ యజమానులు పేర్కొంటున్నారు. తమకు జీఎస్టీ క్రింద వేరే నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్నారు. అమ్మకపు ధరలను స్పష్టంగా వినియోగదారులకు కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో ముద్రించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. 

స్టెంట్స్, ఆర్థో పరికరాలు, సిరంజీలు వంటి వైద్య పరికరాలపై కూడా ధరలను స్పష్టంగా ముద్రించాలని  స్పష్టం చేశారు. ఆసుపత్రులు, మందుల షాప్ లలో ఇష్టం వచ్చిన్నట్లు వైద్య పరికరాలను రోగులకు అమ్మే వీలు లేకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.