//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒక్క అక్షరం తేడాతో ఘరానా మోసం

Category : national

ఒక్క అక్షరం తేడాతో దొంగ ఈ-మెయిల్ తయారుచేసి ఏకంగా రూ.1.67 కోట్లను కొట్టేశాడో ఓ ఘరానా దొంగ. చెన్నైలోని బంగారం ఎగుమతి కంపెనీ ఆర్కేఆర్‌ గోల్డ్‌కు టోపీ పెట్టిన ఆ కిలాడీ సింగపూర్‌కు చెందిన గ్రేస్‌ టాన్‌. 2013 డిసెంబర్‌లో ఆర్కేఆర్‌ గోల్డ్‌ రూ.1.67 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సింగపూర్‌కు చెందిన వాల్యూమిక్స్‌ ప్రీషియస్‌ మెటల్స్‌ ప్రైవేట్‌ కంపెనీకి ఎగుమతి చేసింది. తమ ఈ-మెయిల్‌ చిరునామా Jk.rkrgold@gmail.comను ఉపయోగిస్తూ చెన్నై బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోని తమ ఖాతాకు ఆ మొత్తాన్ని పంపాలని ఆర్కేఆర్‌ గోల్డ్‌ కోరింది. దాని తరువాత ఆ మెయిల్‌ అడ్ర్‌సకు దగ్గరగా ఉండే Jk.rkrgolds@gmail.com ఈ-మెయిల్‌ నుంచి సింగపూర్‌ కంపెనీకి మరొక మెయిల్ వచ్చింది. ఈ దొంగ మెయిల్ ద్వారా అతని పేరిట ఉన్న హెచ్‌ఎస్‌బీసీ ఖాతాకు రూ.1.67 కోట్లు పంపాలన్న మెయిల్‌ను వాల్యూమిక్స్‌కు చేరింది. ఆ మేరకు డబ్బును బదిలీ చేసింది. ఆరు రోజుల తరువాత తమ బకాయి చెల్లించాలంటూ ఆర్కేఆర్‌ గోల్డ్‌ మరో మెయిల్‌ పంపడంతో మోసం బయటపడింది. అతడిపై సీబీఐ కేసు నమోదు చేసింది.