//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెళ్లి చేసుకుంటా అని మోసంచేసిన దర్శకుడు...!

Category : movies

టాలీవుడ్ ని గత కొన్ని రోజులుగా కుదిపేస్తున్న విషయం క్యాస్టింగ్ కౌచ్. ఇంకా దీనిపై ఎవరో ఒకరు మాట్లాడుతూనే వున్నారు. తమకి జరిగిన అన్యాయాల్ని చెప్పుతున్నారు. ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీ ని షేక్ చేస్తుంది. అది ఏమిటంటే.... పెళ్లి చేసుకుంటానని ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని నమ్మించి మోసం చేసిన యువ దర్శకుడి పై కేసు నమోదు అయ్యింది.

పి . లక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్ట్ ని అవకాశాలని ఎరగా వేసి, ప్రేమ పేరుతో నమ్మించి , పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెని శారీరకంగా అనుభవించి, అవసరం అయిపోయాక ఆమెకి మొహం చాటేయడంతో పోలీసులను ఆశ్రయించింది సదరు జూనియర్ ఆర్టిస్ట్,పి . లక్ష్మి తో కొంతకాలం సహజీవనం చేసి కోరికలు తీర్చుకున్న శ్రీ దత్త అనే యువ దర్శకుడి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది .

పి లక్ష్మి ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు శ్రీ దత్త కోసం గాలిస్తున్నారు . దర్శకుడి ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేపట్టి తరుపరి చర్యలు తీసుకోనున్నారు . సహజీవనం ఇప్పుడు కామన్ అయిపొయింది. అలాగే మోసం చేసే వాళ్ళు కూడా తప్పించుకోవడానికి తెలివిగా వ్యూహాలు సిద్దంచేసుకుంటున్నారు.