చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనగానే ఠక్కున గుర్తు వచ్చేది షియోమీ రెడ్ మీ.ఐఫోన్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయ్..ధర మాత్రం అందులో సగమే.15వేలు పెడితే MIలో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ వస్తోంది.దేశంలో ఇప్పుడు MI ఫోన్ల హవా నడుస్తోంది.నెంబర్ వన్ పొజిషన్.ఇప్పుడు ఇండియాలో మరిన్ని ప్రాడెక్ట్స్ లాంఛ్ చేయబోతున్నది.వాటిలో టీవీలు ఒకటి.
చైనా దిగ్గజ కంపెనీ అయిన షియోమీ (MI)..
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో జట్టు కట్టనుంది.త్వరలో ఇండియాలోకి తీసుకురానున్న షియోమీ టీవీలను జియో రిటైల్ స్టోర్లలో లాంచ్ చేసేందుకు సిధ్ధమైంది.రెండు సంస్థల మధ్య చర్చలు నడుస్తున్నాయి.ఇప్పటి వరకు లక్షల్లో ధరలు పలికే LCD, LED టీవీలను..వేలల్లోనే అందించనున్నట్లు సమాచారం.
మరికొన్ని నెలల్లోనే..రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్స్ ద్వారా షియోమీ టీవీలను విక్రయించనుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి దిగ్గజ సంస్థల ధరలతో పోలిస్తే తక్కువ ధరలకే ఫీచర్,రిచ్, హై ఎండ్ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది.
ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో నెంబర్ వన్ గా ఉన్న షియోమీ..టీవీ మార్కెట్ లోనూ నిలిచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తోంది.షియోమీ ఎంట్రీతో స్మార్ట్ టీవీల ధరలు దిగివస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.