//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తాజ్ మహాల్ పేరు మార్చండి

Category : national politics

ఉత్తరప్రదేశ్ కి చెందిన మరో బిజెపి సంచలన వ్యాఖ్యలు చేసారు. ముస్లిం రాజుల నిర్మాణాలకు పేర్లు మార్చాలని ఆయన సూచించారు. అందులో భాగంగా తాజ్ మహాల్ పేరు మార్చాలని కేంద్రానికి సూచించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ముస్లిం రాజుల కాలంలో నిర్మించిన రోడ్లు, స్మారక కట్టడాలు, స్మారక నిర్మాణాలన్నిటికీ పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. తాజ్ మహల్‌కు ‘రామ్ మహల్’ లేదా ‘కృష్ణ మహల్’ అని పేరు పెట్టాలనీ...

తన వరకైతే ‘రాష్ట్రభక్త్ మహల్’ అని పెడితే బాగుందని కూడా ఆయన సూచించారు. కోల్‌కతాలోని విక్టోరియా పేలెస్ పేరు కూడా ‘జానకి ప్యాలెస్’ అని మార్చాలన్నారు. ‘‘ ముస్లిం రాజులు భారత వనరులను ఉపయోగించి నిర్మించినందున వాటి గౌరవాన్ని తగ్గించకూడదు.వాటిని కూల్చాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడి వనరులు, భూములు ఉపయోగించిన వాటికి ఎవరివో పేర్లు ఎలా పెడతారు. వాటి పేర్లు మార్చాల్సిందే..’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.