Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కల్మషం లేకుండా కేసీఆర్ కు శుభాకంక్షాలు తెలిపిన చంద్రబాబు

Category : politics state

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ దిశగా దూసుకుపోతు విజయడంఖా మోగిస్తుంది. పోటీ చేసిన ప్రతి చోట దాదాపు విజయభేరి మోహించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి కూటమికి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేశారు.

కేసీఆర్ నియంత పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే తెలంగాణ ఓటర్లు మాత్రం కూటమిని పక్కన పెట్టి మళ్లీ టీఆర్ఎస్‌ వైపే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్లు, ఫోన్లు చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు అంటూ బాబు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. చంద్రబాబును అభిమానించే వారు ట్వీట్ పై ఆశాభావం వ్యక్త చేస్తున్నారు. ఇది చంద్రబాబు మంచి మనసుకు నిదర్శనం అంటూ చంద్రబాబుని మోసేస్తున్నారు అభిమానులు.

తెలంగాణలో విజయం సాధించినప్పటికీ తెలుగులో చంద్రబాబు తప్పకుండ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాం అంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

Related News