//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ముగ్గురికి నేనున్నాని చెప్పిన చంద్రబాబు

Category : politics state

ఇటీవల గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పార్టీ జెండా కడుతుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని రమేష్ ఆస్పత్రికి తరలించి పార్టీ ఖర్చుతో వైద్యం అందించారు. కాగా చికిత్సలో భాగంగా విద్యార్థులు కాలు, చేతులు కోల్పోయారు. కోలుకున్న అనంతరం ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబును విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు కలుసుకున్నారు. వారితో మాట్లాడిన సీఎం అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా సీఎం పేషీ అధికారులను ఆదేశించారు. సీఎం సాయంపై విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.