Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కార్యకర్తలకు అండగా చంద్రబాబు..

Category : politics

గుంటూరులోని ఎన్టీఆర్‌ భవన్‌ రాష్ట్ర కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన చంద్రబాబు ఇక్కడినుంచి కార్యకలాపాలు కొనసాగించారు. పార్టీకి మూల స్థంభాలు కార్యకర్తలేనని, ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని అయన చెప్పారు. ఇకపై పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే.. మీ అభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఇప్పటికి మన కార్యకర్తలు ఆరుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు అండగా ఉంటా... మనం తప్పు చేయలేదు. అరాచకాలు చేయలేదు.. అవసరమైతే గ్రామాల్లోనే ఉంటానని కేడర్‌లో భరోసా నింపారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారికి 40 శాతం ఓట్లు వేసిన ప్రజల కోసం పనిచేయాలని కర్తవ్యబోద చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నీతివంతమైన పాలన అందించామన్నారు. కేవలం టీడీపీఫై ఉన్న నమ్మకంతోనే రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలను రైతులు ఇచ్చారని గుర్తు చేశారు. కుర్చోవటానికి కుర్చీ లేని పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ఈ స్థాయికి తెచ్చామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పనులు, వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రజలు ఎప్పటికి మర్చిపోరని చెప్పారు. పార్టీకి 65లక్షల మంది కార్యకర్తలే శ్రీరామరక్ష అంటూ భరోసాను నింపారు.

గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన స్ట్రాటజీ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, వైస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు. దాడులకు గురైన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను తనే స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని, వారికి అండగా ఉంటానని చంద్రబాబు వెల్లడించారు. రెండు రోజుల కుప్పం పర్యటన అనంతరం భాదిత కుటుంబాలను పరామర్శిస్తానని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిచనున్నట్లు సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ నేతలు మీడియాకు తెలిపారు.

Related News