//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వచ్చేవారం పోలవరం పనులను పరిశీలిస్తానన్న సీఎం చంద్రబాబు..!

Category : politics

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు 51వ సారి వర్చ్యువల్ రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి దేవినేని ఉమా, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 53 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

కుడికాల్వ పనులు 91 శాతం పూర్తవగా, పోలవరం ఎడవ కాల్వ పనులు 61 శాతం మేర పూర్తిఅయ్యాయి, స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌, పీహెచ్‌ తవ్వకం పనులు 71 శాతం, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్‌ పనులు 14 శాతం, పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం 68 శాతం, రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు 58 శాతం పూర్తయ్యాయని సీఎంకు అధికారులు వివరించారు.

కొత్త వర్క్ ఆర్డర్లను ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అధికారి శ్రీధర్అన్నారు. కొన్ని డిజైన్ల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెప్పారు. అంతేకాక నిర్దేశిత లక్ష్యాల మేరకు పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పురోగతి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. వచ్చేవారం పోలవరం పనులను పరిశీలిస్తానన్న సీఎం చంద్రబాబు చెప్పారు.