//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దుబాయ్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు...!

Category : politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు.

ఆయన నిన్న దుబాయ్ వెళ్లారు. విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్‌లో ఉన్న చంద్రబాబు అక్కడినుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు.

ప్రస్తుతం విజయవాడకు చేరుకున్న చంద్రబాబు ఈరోజు కూడా ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. విభజన హామీలపై రెండు రోజులుగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలు ఏమాత్రం మేలు చేసేలా లేకపోవడంతో పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తమ కార్యాచరణ ప్రకటించనున్నారు.

Related News