//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్రానికి అర్ధమయ్యేలా చెబుతా : చంద్రబాబు

Category : politics

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ రోజు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వ తీరు సరిగాలేదని టీడీపీ మెజార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎలాంటి ప్రత్యేకత చూపలేదని, ఈ బడ్జెట్ చాలా నిరాశగా ఉందని కేంద్ర మంత్రి సుజానా చౌదరీ కూడా విమర్శించారు. రెవిన్యూ లోటు, అమరావతికి నిధులు వంటి అంశాల ప్రస్తావన లేకపోవడం విచారం కలిగించిందని వాపోయారు.

పోలవరం ప్రాజెక్ట్‌కి నిధుల సమీకరణ నాబార్డు ద్వారా ఏర్పాటు చేశారు.కానీ నిధుల ప్రవాహమేమీ చెప్పుకోదగిన రీతిలో లేదన్నారు.ఎక్కడెక్కడో మెట్రోలు ఇచ్చారు కానీ విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో ప్రస్తావన లేదని మండిపడ్డారు.ఓవరాల్‌గా ఈ బడ్జెట్ మీద నిరాశగా ఉన్నామని చెప్పారు.ఏపీ ప్రజల అభిప్రాయమే తమ వాదమని, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఒత్తిడి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించలేదని పలువురు ఏపీ మంత్రులు కూడా అన్నారు.కొద్ది సేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై టెలీకాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రులతో మాట్లాడగా మంత్రులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి అన్యాయం జరిగిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఆదివారం తమ పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిద్దామని చంద్రబాబు రాష్ట్ర మంత్రులతో అన్నారు.

గత నాలుగు ఏళ్లలో కొంత సాధించామని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు. రైల్వే జోన్ తీసుకొచ్చి తీరుతామని, దీన్ని అసలు వదులుకోమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా మాత్రమే దేన్నైనా సాధించుకోవాలని సూచించారు.అలాగే, కాసేపట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి పెంచాలన్న అంశంపై చర్చించనున్నారు.

Related News