//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోజాకు చంద్ర‌బాబు షాకింగ్ ట్రీట్‌మెంట్‌.. ఎమ్మెల్యే నుంచి.. మాజీ ఎమ్మెల్యే వ‌ర‌కు..!

Category : politics

ఎమ్మెల్యే రోజా, ఏపీ రాజ‌కీయాల్లో ఈమె ఒక‌ ఫైర్ బ్రాండ్‌. అంతేకాదు, అమెది ఐరెన్ లెగ్ అంటూ అధికార పార్టీతో స‌హా కొంద‌రు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు సైతం ఎద్దేవ చేస్తుంటారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన తొలినాళ్ల‌లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యే రోజా చేసిన ర‌చ్చ అంతా.. ఇంతా కాదు. అసెంబ్లీలో ఆమె ప్ర‌వ‌ర్త‌న గురించి వివ‌రించే వీడియోలు ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

అయితే, రోజా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలి నాళ్ల నుంచి మూడు మార్లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేసింది. అయితే, చివ‌రి సారిగా న‌గ‌రి నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా గెలుపొందారు. అది కూడా దివంగ‌త రాజ‌కీయ నేత గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడుపై కేవ‌లం 800 ఓట్ల మెజార్టీతోనే.

ఇదిలా ఉండ‌గా, ఆర్కే రోజా ఎమ్మెల్యేగా ఎన్నికైన‌ప్ప‌ట్నుంచి న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమీ లేద‌ని, ప్ర‌భుత్వం నుంచి వ‌స్తున్న నిధులు ప‌క్క‌దారి ప‌డుతూ.. అవినీప‌రుల పాల‌వుతుంద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే మీడియా వేదిక‌గా బాహాటంగా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో రోజా న‌గ‌రి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేద‌ని, దీంతో 2019 ఎన్నిక‌ల్లో ఆర్కే రోజా ఓట‌మి ఖాయ‌మంటూ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నిర్ణ‌యంతోపాటు టీడీపీకి మ‌రో అంశం క‌లిసి రానుంది. అదే, గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు అకాల మృతి.

అయితే, గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు త‌రువాత న‌గ‌రిలో టీడీపీ బాధ్య‌త‌లు చేప‌ట్టే విష‌య‌మై ఆయ‌న కుమారులు ఇద్ద‌రి మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో వైరం న‌డుస్తుందంటూ సోష‌ల్ మీడియా కోడై కూసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు వారిని అమ‌రావ‌తికి పిలిపించార‌ట‌. ఈ క్ర‌మంలో ముందుగా ఎమ్మెల్సీ వెంక‌న్న‌తో భేటీ అయిన వీరు.. ఇక‌పై తామిద్ద‌రం వైరానికి పోవ‌మ‌ని, పార్టీ కోసం క‌లిసి ప‌ని చేస్తామ‌ని, తామిద్ద‌రిలో ఎవ‌రికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా ఓకేనంటూ తెలిపార‌ట‌.

ఈ విషయాన్ని ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లార‌ని, ఆ క్ర‌మంలోనే, గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు పెద్ద కుమారుడికి టిక్కెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు సుముఖ‌త చూపార‌ని స‌మాచారం. అయితే, గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు పెద్ద కుమారుడికి న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ఆయ‌నంటే తెలియ‌ని వారండ‌రు. గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు బ‌తికున్న కాలంలో ఎక్క‌డికి వెళ్లినా.. పెద్ద కుమారుడ్ని తీసుకెళ్లేవార‌ని, ఆ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి బాగా పెరిగింద‌న్న‌ది టాక్‌. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు కూడా పెద్ద కుమారుడికే ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టీడీపీ వ‌ర్గాల స‌మాచారం. ఇలా చంద్ర‌బాబు వేసిన మాస్ట‌ర్ ప్లాన్‌తో ఎమ్మెల్యే ఆర్కే రోజా.. 2019 ఎన్నిక‌ల త‌రువాత మాజీ ఎమ్మెల్యే కానుంద‌ని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జాలు అంటున్నారు. మ‌రి, ఆర్కే రోజా మ‌ళ్లీ ఎమ్మెల్యే అవుతుందా..? లేక మాజీ ఎమ్మెల్యే అవుతుందా..? అన్న‌ది తెలియాలంటే 2019 వ‌ర‌కు వేచి చూడాల్సిందే మ‌రీ.

Related News