//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్‌ని అలా వదిలేకండయ్యా.. ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించండయ్యా..!

Category : politics

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. అసలు విష‌యంలోకి వెళ్ళే ముందు మ‌నం.. ఒక తెలుగు సినిమాలోని డైలాగ్ గురించి చెప్పుకోవాలి. టాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో హీరో వెంకటేష్ ను ఉద్దేశించి నటుడు రావు రమేష్ వేసిన సెటైర్ ఆడ్ని అలా వదిలేయకండ్రా… ఎక్కడైనా చూపించండ్రా బాబు… ఈ డైలాగ్.. ఎంత ప్రజాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఇప్పుడు తాజాగా ఇదే డైలాగ్‌ను జగన్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులతో వ్యాఖ్యానించారు. దేశంలో ఏవైనా నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసుకుని, అందులో ఓ గ్రామానికి ప్రతిపక్ష నేత జగన్‌ను తీసుకెళ్ళి చూపించాలని ఓ జర్నలిస్ట్ ను కోరారు. రాష్ట్రంలో జగన్‌కు ఇసుక తప్ప ఏం కనపడట్లేదని, అభివృద్ధిని వదిలేసి ఎక్కడో ఏదో జరిగిపోతోందని విమర్శిస్తున్నారని, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నపుడు ఒకటి, రెండు చోట్ల ఇటువంటివి జరగడం సహజమని అన్నారు. ఇక, జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల విషయమై మాట్లాడుతూ… నీరవ్ మోదీ కంటే జగన్ తక్కువేం కాదని, అవినీతితో ఆస్తులు పోగేశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై తాము పోరాడుతుంటే, జగన్‌ పై ఉన్న అవినీతి కేసులను కేంద్రం నీరు గారుస్తోందని, ఐదుగురు ఎంపీలను అడ్డం పెట్టుకుని జగన్ కేంద్రంతో బేరాలాడి కేసుల మాఫీకి కుమ్మక్కయ్యారన్నారని విమర్శించారు.