Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాకు పని లేక వచ్చానా..? చంద్రబాబు ఆగ్రహం

Category : state politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సమన్వయ కమిటి సమావేశానికి వారు హాజరుకాకపోవడం పై ఆయన మాట్లాడుతూ వారికి పదవులు అవసరమా అని ప్రశ్నించారు. ఎందుకు హాజరుకాలేదంటూ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును చంద్రబాబు ప్రశ్నించారు. ‘మీ నేతలు అంత బిజీగా ఉన్నారా ?... నాకు పనిలేక సమావేశానికి వచ్చానా?’అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమన్వయ కమిటీ సమావేశానికి రాని వాళ్ళకు పదవులు అవసరమా? అని బాబు అన్నారు. నేతలకు హోదా పార్టీ వల్లే వస్తుందని...పార్టీ అంటే లెక్కలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిపై గట్టిగా వ్యవహరించాలంటూ జీవీ ఆంజనేయులుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Related News