//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు వైసీపీ దుర్మార్గంపై సంచలన ట్వీట్..!

Category : state politics

టీడీపీ మరియు వైసీపీ నేతల మధ్య గత కొన్ని రోజులు నుంచి పొలిటికల్ వార్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. మీడియా మరియు ప్రత్యక్షంగా ఈ రెండు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం వైసీపీ చేసే ప్రతీ ఒక్క చిన్న తప్పును కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా సహా నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ ఖాతా నుంచి వైసీపీపై ఓ రేంజ్ విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదంతా ఒక వైపు అయితే ఇపుడు వైసీపీ అకృత్యాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని మరియు జగన్ను డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తూ "వైసీపీ ప్రభుత్వ దుర్మార్గానికిది పరాకాష్ట. తమ సమస్య చెప్పుకోడానికని వచ్చిన ఎఎన్ఎమ్ లను ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. గత్యంతరంలేక ఆందోళనకు దిగిన మహిళలను బెదిరించడానికి వారి భర్తలను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారా? న్యాయం చేయడం చేతకాక మహిళల పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తారా?" అని చంద్రబాబు సంచలన ట్వీట్ ఒకటి పోస్ట్ చేసారు. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు కూడా వైసీపీ తీరు పై స్పందించారు.