//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హత్య వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ ఇంట్లో జరిగింది ..టీడీపీ కి ఏం సంబంధం అన్న చంద్రబాబు

Category : politics state

ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ కి చెందిన కీలక నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు , జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అయితే ఈ హత్యపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని , ఏపీ ప్రభుత్వం పై నమ్మకం లేదని , టీడీపీ నాయకుల పాత్ర వుందని వైసీపీ నేతలు ఆరోపించారు. వై సీపీ అధినేత జగన్ సైతం సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. ఇక టీడీపీ , వై సీపీ నేతల మాటల యుద్ధాలు ఈ హత్యోదంతంపై కొనసాగుతున్నాయి.

ఏపీలో ఎన్నికల వేళ జరిగిన ఈ హత్య రాజకీయ హత్యగా వై సీపీ నాయకులు ఆరోపిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హత్యలను కూడా రాజకీయాలు చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య లో చంద్రబాబు కుట్ర ఉంది అంటూ.. శుక్రవారం వైసీపీ అధినేత జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై చంద్రబాబు స్పందించారు.

శనివారం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వివేకా హత్య వాళ్ల ఊళ్లో.. వాళ్ల ఇంట్లో జరిగిందని.. దీనికి టీడీపీని నిందించడం అమానుషమన్నారు. తప్పులు చేసి తప్పించుకోవడం జగన్ దురలవాటని దుయ్యబట్టారు.

వ్యాపారంలో, రాజకీయంలో జగన్ అడ్డదారి, చెడ్డదారి చూసుకుంటారని ఆరోపించారు. జగన్ ఏరంగంలోకి అడుగుపెడితే.. ఆ రంగంలో అప్రదిష్ట అని చంద్రబాబు వ్యాఖ్యానించారు . రాజకీయ లాభం కోసమే కోడికత్తి డ్రామా ఆడారని.. కావాలనే తనపై దాడి చేయించుకున్నారని ఆరోపించారు.ఎన్నికల కోసమే షర్మిలతో పాత కేసులు మళ్లీ పెట్టించారని మండిపడ్డారు.

Related News