//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ ని ఓడించండి ....చంద్రబాబు సంచలన ప్రకటన ...!

Category : politics state

ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ రోడ్ షోలో నోరుజారి కాంగ్రెస్ ను ఓడించాలని చెప్పాడు , ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషమ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటినే గుర్తుచేసిన కేసీఆర్, చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"కాంగ్రెస్‌ పార్టీని ఓడియ్యాలని చంద్రబాబు అంటుండు. ఆయనమో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నడు. ఏమన్న కిందమీదకు అయ్యిందేమో. దేనికి మద్దతు ఇస్తుండో దాన్నే ఓడించాలంటుండు. అంత గతి తప్పి మాట్లాడొద్దు కదా. మెటలయ్యిందేమో చూపీయండి" అని సెటైర్లు వేశారు.

తాను తెలంగాణకు కాపలా కుక్కలాగా పని చేస్తేనే 24 గంటల కరెంటును ఇవ్వగలుగుతున్నానని, చంద్రబాబు తన పాలనలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన శక్తితోనే తాను నాలుగేళ్లు పరిపాలన సాగించానని, ఇప్పుడు ప్రజా కూటమి రూపంలో పెనుముప్పు తెలంగాణను కబళించాలని చూస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Related News