//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ఎవ్వ‌రూ ఊహించ‌ని పేరును ప్ర‌తిపాదించిన చంద్ర‌బాబు..!

Category : politics

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడికి గ‌తంలోనే ప్ర‌ధాన మంత్రి అయ్యే అవ‌కాశం వ‌చ్చింది. కానీ, రెండుసార్లు కూడా ఆ అవ‌కాశాన్ని తిర‌స్క‌రించారు Chandrababu ఎందుకంటే ఏపీని వ‌దిలి వెళ్ల‌డం Chandrababu కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు కూడా బాబుని ప్రాంతీయ పార్టీల ప్ర‌ధాని అభ్య‌ర్ధి అంటూ జాతీయ స్థాయి నేత‌లంతా బాబుని ముందుకు తోస్తున్నారు. ఎందుకంటే మోడీకి విరుగుడు బాబు మాత్ర‌మే అని వారంద‌రీ గ‌ట్టి న‌మ్మ‌కం. కానీ బాబు మాత్రం స‌సేమిరా అంటున్నార‌ట‌. కాక‌పోతే ప్ర‌ధాని అభ్య‌ర్ధిని మాత్రం నిర్ణ‌యిస్తాన‌ని చెబుతున్నారు.

ఇంత‌కీ Chandrababu మ‌న‌సులో ఉన్న ప్ర‌ధాని అభ్య‌ర్ధి ఎవ‌రు..? ఆయ‌నేనా..? ఆయ‌నైతేనే క‌రెక్ట్ అనే భావ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ట‌. ఆయ‌నే గ‌నుక ప్ర‌ధాని అభ్య‌ర్ధి అయితే మోడీ అవుట్ అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం. మ‌రి ఇంత‌కీ చంద్ర‌బాబు మ‌న‌సులో ఉన్న ప్ర‌ధాని అభ్య‌ర్ధి ఎవ‌రు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే.

ఇక అస‌లు విష‌యానికొస్తే, తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల దేశ రాజ‌ధాని ఢిల్లీలో ముమ్మ‌రంగా ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. Chandrababu త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దేశ రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఢిల్లీ వేదిక‌గా గ‌ళ‌మెత్తారు. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తూనే.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీ, జీఎస్టీ, నోట్ల ర‌ద్దు వంటి ప్ర‌ధాని మోడీ అనాలోచిత నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

అనంత‌రం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌తో Chandrababu స‌మావేశమ‌య్యారు. ఈ స‌మావేశంలోనే నేత‌ల మ‌ధ్య ప‌లు ఆస‌క్తిక‌ర చ‌ర్చ కొన‌సాగింది. ప్రాంతీయ పార్టీల‌న్నీ కూట‌మిగా ఏర్ప‌డితే ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ఎవ‌రుంటారు..? అన్న ప్ర‌శ్న వారిలో త‌లెత్తింది. అప్ప‌టికే వారంద‌రి మ‌దిలో ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా మెదిలిన వ్య‌క్తి చంద్ర‌బాబు. అనుకున్న‌దే త‌డ‌వుగా అంద‌రూ క‌లిసి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మాణాన్ని Chandrababu ఉంచారు. అదే ప్ర‌ధాని అభ్య‌ర్ధి. ప్ర‌ధాని మోడీపై మీ పోరాటం చూశాం, ప్ర‌ధాని మోడీ చేస్తున్న అన్యాయాల‌ను నిల‌దీయ‌డంలో ధైర్య సాహ‌సాలు చేస్తున్న వారిలో ముందు వ‌రుస‌లో మీరే ఉన్నారు. అంతేకాక‌, రాజ‌కీయ అనుభ‌వం, నూత‌నంగా ఏర్ప‌ప‌డ్డ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కేంద్ర ప్ర‌భుత్వ సాయం లేక‌పోయినా అభివృద్ధి చేయ‌డంలో మీకు మీరే సాటి అంటూ ప్రాంతీయ పార్టీల నేత‌లు తీర్మానంలో పేర్కొన్నారు.

అయితే, ప్రాంతీయ పార్టీల నేత‌లు చేసిన తీర్మాణాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు మాట్లాడుతూ.. త‌న‌కు ప్ర‌ధానమంత్రి కావాల‌ని లేద‌ని, ఆ విష‌యానికే వ‌స్తే. .ఆ అవ‌కాశం త‌న‌కు ఎప్పుడో వ‌చ్చింద‌ని, అయినా ప్ర‌ధాని మంత్రి అయ్యే అవ‌కాశాన్ని తాను సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు చంద్ర‌బాబు గ‌తాన్ని చెప్పారు. మ‌ళ్లీ ఇప్పుడు అదే చెబుతున్నా, నాకు ప్ర‌ధాని ప‌ద‌విపై ఆశ లేదు. కావాలంటే ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ఎవ‌రిని ప్ర‌క‌టిస్తే బాగుంటుంది అని సూచిస్తానంటూ చెప్పారు Chandrababu naidu.

అయితే, Chandrababu naidu ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా సూచించ‌బోయే ఆ అభ్య‌ర్ధి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొందిన‌ మైనార్టీ వ‌ర్గానికి చెందిన ప్ర‌జా నేత‌గా ఓ సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల‌తోపాటు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ఆయ‌న అభ్య‌ర్ధిత్వాన్ని కాద‌న‌లేర‌ని, అటువంటి వ్య‌క్తి ప్ర‌ధాని అయితేనే దేశానికి మంచి జ‌రుగుతుందంటూ చంద్ర‌బాబు వారికి సూచించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌ధాని అభ్య‌ర్ధిత్వానికి సంబంధించిన వివ‌రాల‌ను అతి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాన‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం కొస‌మెరుపు.

Related News