Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బెదిరించిన బీజేపీ తగ్గని చంద్రబాబు..పధకాల విడుదలకు హామీలు..!

Posted 14 days ago | Category : politics

తొలుత పార్లమెంటులో బడ్జెట్ సమావేశం లో టీడీపీ ఎంపీలను దారిలో ఉంచడానికి బీజేపీ దబాయింపు,బెరింపులకు దిగింది.టీడీపీ తగ్గకపోవడంతో ఆ తర్వాత సంప్రదింపులకు దిగి,చివరకు సముదాయింపులకు దిగింది.బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన రోజున పార్లమెంట్ హాల్లో కొందరు పాత్రికేయులతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ,చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఏపీ రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు కావాలని ఆయన అడుగుతారని,అంత డబ్బు ఎవరిస్తారు,ఎక్కడి నుంచి తెచ్చిస్తారు,అంటూ జైట్లీ మండిపడ్డారు.ఏపీకి ఇప్పటికే చాలా నిధులు ఇచ్చామని ఏయే పద్దుల కింద ఎన్ని డబ్బులు ఇచ్చామో లెక్కలు చూపిస్తామని అప్పుడు వాళ్లే ఇబ్బంది పడతారని హెచ్చరించారు.

రెవెన్యూ లోటును కూడా ఏపీ ప్రభుత్వం ఎక్కువ చేసి చూపెడుతోందని వాళ్లు అడిగినన్ని డబ్బులు ఇవ్వబోమని స్పష్టం చేశారు.ఈ బెదిరింపుల విషయం కాస్తా చంద్రబాబుకు తెలిసిపోయింది.దీంతో ఆందోళనలు ఉద్ధృతం చేయాలంటూ తమ ఎంపీలను ఆదేశించారు.ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దని ఆందోళనలతో ఉభయ సభలు అట్టుడికిపోవాలని చెప్పారు.

ఊహించని విధంగా పరిస్థితులు మారడంతో బీజేపీ పెద్దలు రూటు మార్చారు.టీడీపీతో బీజేపీ ఎంపీలు సంప్రదింపులకు దిగారు.చంద్రబాబుతో బీజేపీ అధినేత అమిత్ షా,కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ లు పోన్లు చేసి మాట్లాడారు.ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఎలాంటి సందేహాలను పెట్టుకోవద్దని ప్రధాని ప్రసంగానికి అడ్డుతగలవద్దని చంద్రబాబును కోరారు.

మరోవైపు ఇదే సమయంలో బీజేపీ పెద్దలకు మరో డౌట్ కూడా వచ్చింది.ఢిల్లీ నుంచి వస్తున్న కాల్స్ తో చంద్రబాబు చలించలేదు.తమ పోరాటం వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని ఇచ్చిన హామీలను నెరవేర్చమనే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు.దీంతో ఇతర పార్టీల నేతలో చంద్రబాబు ఏవైనా సంప్రదింపులు జరుపుతున్నారా అనే కోణంలో ఆరా తీశారు.అలాంటిది ఏమీ లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏపీ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని కసరత్తును ప్రారంభించారు.

అయితే సభలో మూడుసార్లు జైట్లీ ప్రకటన చేసినా ప్రతిసారీ పాత లెక్కలే చెప్పారు.దీంతో, టీడీపీ ఫైర్ అయింది.సమావేశాలు ముగిసే వరకు తన ఆందోళనలు కొనసాగింది.ఏపీ ఎంపీల ఆందోళనల మధ్యే ఉభయసభలు వాయిదా పడ్డాయి.అనంతరం నిన్న సాయంత్రం ఏపీకి కేంద్ర ప్రభుత్వం కొంతమేర నిధులను ప్రకటించింది.14వ ఆర్థిక సంఘం కింద 369 కోట్లు,జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరో 31.76 కోట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 9 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 10 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 17 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 18 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted a day ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 2 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 2 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 2 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 2 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 3 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!