//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాన్ బెయిలబుల్ వారెంట్స్ పై స్పందించిన బాబు ...

Category : politics

బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి సీఎం హారతిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బాబ్లీ ఎపిసోడ్, నాన్ బెయిలబుల్ వారెంట్లపై ఫస్ట్ టైం స్పందించారు.

" బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడాను. ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని పోరాటం చేశాను. కానీ బాబ్లీ కేసులో నాకు నోటీలిచ్చామని అంటున్నారు. నేను నేరం చేయలేదు.. ఘోరాలు చేయలేదు.. అన్యాయం అస్సలే చేయలేదు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని బాబ్లీని వ్యతిరేకించాను. నేనేం తప్పు చేయలేదు.. ఏం చేస్తారో చేయండి అని ఆ రోజే పోలీసులకు చెప్పాను. ఇప్పుడు నోటీసులు.. అరెస్ట్ వారెంట్లు అంటున్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తాను. ఏ రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందో ఆలోచించాలి" అని ఈ సందర్భంగా బాబు చెప్పుకొచ్చారు.

" ఏపీలో అందరికీ నీటి భద్రత ఇవ్వడమే నా లక్ష్యం. అన్ని ప్రాంతాలకు నీళ్లిచ్చే వరకు జలదీక్ష ఆగదు. వంశధార-నాగావళి అనుసంధానం చేస్తున్నాం. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. రాయలసీమ నీటి కోసం అనేక ఆందోళనలు జరిగాయి. సీమకు నీళ్లివ్వాలని మొదట నిర్ణయించింది దివంగత నేత ఎన్టీఆరే. సమైక్య రాష్ట్రంలో కర్నూలుకు అధిక నిధులు కేటాయించాం" అని ఈ సందర్భంగా బాబు వివరించారు.

#APCM #Chandrababunaidu #Appolitics #Apcmchandrababunaidu #Nonbailablewarrant

Related News