//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

11న ఢిల్లీలో బాబు దీక్ష ఖర్చు ఎంతో తెలుసా

Category : state politics

రానున్నది ఎన్నికల కాలం కావడంతో ఏపీకి కేంద్ర సర్కార్ చేసిన అన్యాయాన్ని హస్తిన వేదికగా ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఒకపక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై, అదే విధంగా విభజన హామీల అమలు గురించి, ఏపీ నిధుల కేటాయింపుపై రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన చంద్రబాబు కేంద్రానికి కనువిప్పు కలిగేలా ఢిల్లీ వేదికగా ఒకరోజు దీక్ష చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఢిల్లీ కేంద్రంగా చేయనున్న దీక్ష దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన దేశరాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష ఖర్చు రూ. 2 కోట్లు అని తెలుస్తోంది.

దీక్ష ఏర్పాట్ల కోసం రూ.2 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,12,16465 రూపాయలను విడుదల చేశారు. ఇందులో ముఖ్యమంత్రి హెలికాప్టర్ చార్జీలను చేర్చలేదు. చంద్రబాబు దీక్షకు ప్రజలను ఢిల్లీకి తరలించడానికి ప్రభుత్వం రెండు రైళ్లలో 20 బోగీల చొప్పున అద్దెకు తీసుకుంది. వీటిలో ఓ రైలు అనంతపురం నుంచి ప్రారంభమవుతుండగా, మరో రైలుడు శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుంది. ఈ రైళ్లు ఈ నెల 10వ తేదీకి ఢిల్లీ చేరుకుంటాయి.

శ్రీకాకుళం నుంచి బయలుదేరుతున్న రైలుకు రూ.59,49,380 ఖర్చు పెడుతుండగా, అనంతపురం నుంచి బయలుదేరుతున్న రైలుకు రూ.42,67,085 చెల్లిస్తున్నారు. బోగీలకు 10 లక్షల రూపాయలకు డిపాజిట్ చేస్తున్నారు .మొత్తం ఖర్చు రూ.1,12,16,465 అవుతుంది. మొత్తానికి ఢిల్లీ వేదికగా చంద్రబాబు చేయనున్న దీక్షకు రెండు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలుస్తోంది.

Related News